బంగాళాఖాతంలో ఏర్పడిన పెను తూఫాన్
హుదుద్ ఆంధ్రప్రదేశ్,ఓడిశాలే లక్ష్యంగా వేగంగా దూసుకొస్తుంది.విశాఖకు
తూర్పు-ఆగ్నేయ దిశలో 330,ఒడిశా గోపాలపూర్ కి దక్షిణ-ఆగ్నేయ దిశలో 380
కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది.మరికొద్ది గంటల్లో హుదుద్ తన
ప్రతాపాన్ని చూపనుంది.తీరం దాటే ఈ తూఫాన్నే ‘హుదుద్’ అంటున్నారు.
బంగాళాఖాతం,అరేబియా సముద్రాలలో ఏర్పడే తూఫాన్లకు భారత్,శ్రీలంక,బంగ్లాదేశ్,ఒమన్,మయన్మార్,పాకిస్థాన్,థాయిలాండ్ మొదలగు దేశాలు పేర్లు నిర్ణయిస్తాయి.అయితే ఇప్పుడు ఏర్పడిన తూఫాన్ కు ‘హుదుద్’ అని నామకరణం చేసింది ఒమన్.కావాలంటే మీరు కూడా ఒక పేరును సూచించవచ్చు.మీరు సూచించే పేరును భారతీయ వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ కు పంపించవచ్చు.
అసలు హుదుద్ అంటే ఏంటో చూద్దాం.’హుదుద్’ అనేది ఒక పక్షి.ప్రస్తుతానికి ఈ పక్షి ఇజ్రాయిల్ దేశ జాతీయ పక్షి.ఆసియా తోపాటు,ఆఫ్రికా మరియు యూరోప్ లోని కొన్ని దేశాల్లో ఈ పక్షి కనిపిస్తుంది.

No comments:
Post a Comment