Radio LIVE


Breaking News

Friday, 21 March 2014

పద్మవిభూషణ్ కుష్వంత్ సింగ్(99) కన్నుమూత

ప్రముఖ జర్నలిస్ట్ , రచయిత కుష్వంత్ సింగ్ గురువారం న్యూఢిల్లీలో మరణించారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. సుజన్ సింగ్ పార్క్ లోని తన నివాసంలో మధ్యాహ్నం చనిపోయారు అని,సాయంత్రం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుమారుడు రాహుల్ సింగ్ చెప్పారు.
1915 ఫిబ్రవరి 2న పాకిస్థాన్ లో ఉన్న పంజాబ్ లోని హడలిలో జన్మించారు. 1974 లో కుష్వంత్ సింగ్ ను భారత్ ప్రభుత్వం పద్మ భూషణ్ తో సత్కరించింది. 1984 సంవత్సరంలో స్వర్ణ దేవాలయంలో చోటు చేసుకున్న ఘటనలకు నిరసనగా పద్మభూషణ్ పురస్కారాన్ని తిరిగి ప్రభుత్వానికి ఇచ్చివేశారు.2007లో కుష్వంత్ సింగ్ ను పద్మవిభూషణ్ పురస్కారంతో భారత ప్రభుత్వం సత్కరించింది.
కుష్వంత్ సింగ్ ప్రభుత్వ పత్రిక యోజన కు వ్యవస్థాపక సంపాదకుడుగా కొనసాగుతున్నారు. హిందూస్థాన్ టైమ్స్, ది ఇలస్ట్రేట్రడ్ వీక్లీ ఆఫ్ ఇండియా,నేషనల్ హెరాల్డ్ పత్రికలకు సంపాదకులుగా పని చేశారు కుష్వంత్ సింగ్.దాదాపు 34 పుస్తకాల వరకు ఆయన రచించారు. 'ట్రైన్ టు పాకిస్తాన్', 'ఢిల్లీ', 'హిస్టరీ అఫ్ సిక్స్', 'ఐ షల్ నాట్ హియర్ టు నైటింగెల్స్' వంటివి అతని రచనలలో ప్రముఖమైనవి.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates