టీ20 ప్రపంచకప్ లో భారత్ తన విజయపరంపరను కొనసాగిస్తుంది. ఈరోజు మీర్పూర్ లో
జరిగిన మ్యాచ్ లో ధోని సేన బంగ్లాదేశ్ పై విజయంతో వరుసగా 3వ విజయాన్ని
అందుకుంది.
టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ చేసిన భారత్ మంచి బౌలింగ్ ప్రదర్శన కనబరిచింది. ఎక్కడ స్కోర్ వేగాన్ని పెంచుకునే అవకాశం బంగ్లాదేశ్ కు దొరకలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 138 పరుగులు సాధించింది. హక్(44),మహ్మదుల్లా(33) రాణించారు. అమిత్ మిశ్రా 3 వికెట్లు, అశ్విన్ 2 వికెట్లు తీసుకున్నారు.
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఆదిలోనే శికర్ ధావన్ వికెట్ కోల్పోయినా రోహిత్ శర్మ (56), విరాట్ కోహ్లి(57*) మరోసారి రాణించారు. చివర్లో ధోని(22*) 2 సిక్సర్లతో మ్యాచ్ ముగించాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అశ్విని కి దక్కింది. భారత్ గెలిచిన మొత్తం మూడు మ్యాచ్ ల్లోనూ స్పిన్నర్లకే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కడం విశేషం.
ఈ విజయంతో భారత్ సెమీ ఫైనల్ బెర్త్ కరారు చేసుకుంది

No comments:
Post a Comment