బాలకృష్ణ నటించిన ఏ సినిమాకు లేని అంచనాలు 'లెజెండ్' చిత్రానికి
ఉన్నాయి.భారీ అంచనాలతో ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు వస్తుంది 'లెజెండ్' .
బాలకృష్ణ,బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన 'సింహా' మంచి విజయం సాధించడంతో ఇదే
కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రానికి ఊహించని రీతిలో అంచనాలు పెరిగాయి.
బాలయ్య గెటప్ ఈ చిత్ర ప్రదానకర్షణ.
రాజకీయ సంబంధమైన డైలాగ్ లు ఉన్నాయంటూ సెన్సార్ అధికారులు అభ్యంతరం
చెప్పడంతో ఎలక్షన్ అధికారికి సినిమా చూపించి క్లియరెన్స్ తెచ్చుకోవాల్సి
వచ్చింది సినిమా నిర్మాతలు. సెన్సార్ బోర్డ్ 'ఎ' సర్టిఫికేట్ జారీ చేయడంతో
చిత్రాన్ని ఈనెల 28 న విడుదల చేయడానికి అన్ని కార్యక్రమాలు పూర్తి
చేసుకున్నారు నిర్మాతలు.
విడుదలకు ముందే చిత్ర నిర్మాతలకు దాదాపు 6.5 కోట్లు టేబుల్ ప్రాఫిట్
వచ్చినట్లు సినిమా వర్గాల సమాచారం. సినిమా హిట్ అయితే లాభాలు మరింతగా
పెరిగే అవకాశం ఉంది. చూడాలి రేపు విడుదల అవుతున్న ఈ చిత్రానికి ప్రేక్షకులు
ఏ తీర్పు ఇస్తారో.
No comments:
Post a Comment