టీ20 అంటేనే సంచలనాలకు మారు పేరు. ఈరోజు అదే జరిగింది. నెదర్లాండ్స్ సంచలనం
సృష్టించింది.నెదర్లాండ్స్ ముందు 190 పరుగుల లక్ష్యం, ఓవర్ కు 9 పైనే నెట్
రన్ రేట్, ఒక విధంగా అసాధ్యమైన స్కోర్, ఎందుకంటే పెద్దగా పేరున్న జట్టు
కాదు, కష్ట సాధ్యమైన లక్ష్యాన్ని చేదించడానికి బిగ్ హిట్టర్స్ లేరు.
అందరూ ఐర్లాండ్ గెలుస్తుంది అని అనుకున్నాఅంచలనాలు తారుమారు అయ్యాయి.190
పరుగుల లక్ష్యం 20 ఓవర్లలో సాధించడమే కష్టమే అనుకున్నా, సూపర్-10 కు
చేరాలంటే 14.2 ఓవర్లలోనే
విజయం సాధించాలి నెదర్లాండ్స్.అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది డచ్
టీమ్.మైబర్గ్ 23 బంతుల్లో 63 పరుగులు, కూపర్ 15 బంతుల్లో 45 పరుగులు
చివర్లో బరేస్సి 22 బంతుల్లో 40 పరుగులు చేయడంతో
13.5 ఓవర్లలోనే విజయం సాధించి జింబాబ్వే ఆశలపై నీళ్ళు చల్లింది
నెదర్లాండ్స్.
No comments:
Post a Comment