Radio LIVE


Breaking News

Friday, 21 March 2014

అటు అలా - ఇటు ఇలా

ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల జాతర సమయం. అన్ని రాజకీయ పార్టీలకు సవాలు, గెలుపుపై ప్రతీ పార్టీ ధీమాతో ఉన్నాయి.ఈ ఎన్నికల కోలాహల వేళ రాజకీయ పార్టీలు ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి పడుతున్న తంటాలు అనేకం.ప్రచారంలో అన్ని పార్టీలు ముందున్నాయి, ప్రజలకు హామీలు గుప్పిస్తున్నాయి.
ప్రచార విషయానికి వస్తే సీమాంధ్రలో పార్టీల జోరు చూస్తుంటే తెలంగాణాలో జోరు అంతగా లేదు అనే చెప్పాలి. దాదాపుగా అన్ని పార్టీలు సీమాంధ్రలో ప్రచారాన్ని చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్రలు, తెలుగు దేశం పార్టీ ప్రజా గర్జనలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ రోడ్ షోలు, కిరణ్ కుమార్ రెడ్డి కూడా  రోడ్ షో చేస్తున్నారు. చివరికి జనసేన పార్టీ కూడా ఈనెల 27న వైజాగ్ లో లక్ష మందితో ప్రజా గర్జనకు రెడీ అవుతుంది.
కాని తెలంగాణాలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.
ఇప్పటి వరకు ఏ రాజకేయ పార్టీ నాయకులు అధికారికంగా ప్రచారాన్ని ప్రారంభించలేదు. త్వరలో జిల్లా పర్యటనలు ప్రారంభించడానికి కెసిఆర్ సన్నద్ధం అవుతున్నారు. మిగతా పార్టీలు కూడా ప్రజల వద్దకు వెళ్ళడానికి సన్నహకాలు చేస్తున్నారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates