Friday, April 11, 2025

Radio LIVE


Breaking News

Monday, 24 March 2014

కన్న కూతురునే కడతేర్చిన కసాయి తల్లిదండ్రులు

నిన్న గుంటూరు లో జరిగిన ఘటన చూస్తుంటే తల్లిదండ్రులు ఇలా కూడా ఉంటారా అనే అనుమానం కలుగుతుంది. కులాంతర వివాహం చేసుకుందని కన్న కూతురునే కడతేర్చారు కసాయి తల్లిదండ్రులు.
     రాజేంద్ర నగర్ 2వ లైన్ లో నివాసముండే హరికృష్ణ, సామ్రాజ్యంల కుమార్తె దీప్తి హైదరాబాద్ లోని HCL కంపెనీలో  సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుంది. అక్కడే అనంతపల్లి కిరణ్ కుమార్ తో పరిచయం కాస్త ప్రేమగా మారింది. దాదాపుగా రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న వీరి ప్రేమను అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ప్రాజెక్ట్ పని మీద ఈ సంవత్సరం జనవరి లో అమెరికాకు వెళ్ళాడు కిరణ్. అమ్మాయి పేరెంట్స్ వేరే సంబంధాలు చూస్తుండడంతో దీప్తి కిరణ్ కు సమాచారం అందించడంతో వచ్చి ఈ నెల 21న ఆర్య సమాజ్ లో ఇద్దరు వివాహం చేసుకున్నారు.
    ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు హైదరాబాద్ కు వచ్చి పెళ్లి గ్రాండ్ గా చేద్దాం అని నమ్మబలికించి గుంటూరుకి తీసుకెళ్ళారు. దీప్తి మరియు కిరణ్ పేరెంట్స్ లాడ్జ్ లో ఉన్నారు. ఆదివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్ళింది దీప్తి. కొద్ది సేపటికే కిరణ్ ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి దీప్తి ఇంటికి చేరుకోగా ఇంటికి తాళం వేసి ఉండడంతో పోలీస్ లకు కంప్లైంట్ చేశాడు కిరణ్.  తాళాలు పగలగొట్టి చూస్తే దీప్తిని మంచానికి కట్టి చున్నీతో చంపేసి ఆమె తల్లిదండ్రులు పరారయ్యారు.
    కులమతాలకు పట్టింపులేని ఈరోజుల్లో పరువుకుపోయి కులాంతర వివాహం చేసుకుందని కన్న కూతురునే కర్కషంగా చంపిన తల్లిదండ్రులను కఠినంగా శిక్షించాలని పలు సంఘాలు కోరుతున్నాయి. ఐపీసీ 302 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దీప్తి తల్లిదండ్రులకోసం పోలీసులు గాలిస్తున్నారు. 

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates