బంగ్లాదేశ్ లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో ఈరోజు న్యూజిలాండ్
తో జరిగిన మొదటి మ్యాచ్ లో,దక్షిణాఫ్రికా అధ్బుతమైన విజయాన్ని సొంతం
చేసుకుంది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠ గా సాగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా పై
చేయి సాధించింది. విజయానికి చేరువకు వచ్చి చేతులెత్తేసింది న్యూజిలాండ్.
గెలుస్తుంది అనుకున్న న్యూజిలాండ్ ను అద్భుతమైన చివరి ఓవర్లో స్టెయిన్ నిప్పులు చెరిగాడు. చివరి ఓవర్లో న్యూజిలాండ్ విజయానికి కావాల్సింది 7 పరుగులుంఒదతి బంతికే వికెట్ తీసుకున్న స్టెయిన్ తరువాతి 3 బంతులకు పరుగులేమి ఇవ్వలేదు, 4వ బంతికి 4పరుగులు, 2 బంతులు 3 పరుగులు ఉన్న దశలో మళ్ళీ వికెట్ సాహించాడు స్టెయిన్, ఇక చివరి బంతికి 3 పరుగులు,బ్యాటింగ్ చేసేది టేలర్,రనౌట్ రూపంలో టేలర్ వెనుదిరగడంతో దక్షిణాఫ్రికా చారిత్రక విజయాన్ని అందుకుంది.
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు సాధించింది. డుమిని వేంగంగా 86(నాటౌట్) పరుగులు చేయడంతో మంచి లక్ష్యాన్ని న్యూ జిలాండ్ ముందుంచింది. న్యూజిలాండ్ జట్టు ఆది నుండి పరుగులు వేగంగా సాధిస్తూ విజయం వైపు దూసుకెళ్లింది. చివరి ఓవర్లో స్టెయిన్ రూపంలో న్యూజిలాండ్ కు ఓటమి తప్పలేదు. టేలర్ 62, విలియమ్స్ 51పరుగులతో రాణించారు. స్టెయిన్ 17 పరుగులకే 4 వికెట్లు సాధించాడు.

No comments:
Post a Comment