Radio LIVE


Breaking News

Friday, 21 March 2014

మొదటి సారి మైదానంలో LED వికెట్లు

ఈసారి టీ20 ప్రపంచకప్ లో వికెట్లు కొత్తగా కనిపించనున్నాయి.స్టంప్స్ మరియు బెయిల్స్ సరికొత్తగా రూపొందించారు. రనౌట్ విషయంలో ఖచ్చితత్వం కోసం బాల్ వికెట్లను తాకగానే మెరిసేలే స్టంప్స్,బెయిల్స్ తయారు చేశారు. అంటే వికెట్లు బాల్ తాగగానే ఫ్లాష్ అవడం ఆవెంటనే లెడ్ సిగ్నల్ ని స్టంప్స్ కి అందివ్వడం ,లైట్ వెలగడం జరుగుతాయి, ఇవన్ని సెకనులో వెయ్యోవంతులో జరగడం విశేషం.మొత్తంగా LED పరిజ్ఞానం అని చెప్పవచ్చు.
మొదటి సారిగా ఈ పరిజ్ఞానాన్ని2012 'బిగ్ బాష్' టోర్నీ లో వాడారు. ఐసీసీ ఈ విధానాన్ని మొదటి సారిగా బంగ్లాదేశ్ లో జరుగుతున్నా T20 ప్రపంచకప్ లో ప్రవేశపెడుతుంది.జింగ్ వికెట్స్ అని కూడా పిలుచుకునే ఈ టెక్నాలజీ రూపకర్త దక్షిణ ఆస్ట్రేలియా కి చెందిన 'జింగ్ ఇంటర్నేషనల్'.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates