ఆదివారం ఆస్ట్రేలియా తో జరిగిన టీ20 ప్రపంచకప్ లో భారత్ విజయ పరంపరను
అడ్డుకోలేకపోయింది. ప్రపంచకప్ లో వరుసగా 4వ విజయాన్ని అందుకుంది. తప్పక
గెలవాల్సిన మ్యాచ్ లో ఆసీస్ చేతులెత్తేసింది,దీంతో ఇంటిదారి పట్టాల్సి
వచ్చింది.
టాస్ గెలిచి భారత్ ని బ్యాటింగ్ కు ఆహ్వానించిన ఆసీస్ మంచి బౌలింగ్ ప్రదర్శన చేసింది,ఒక దశలో 66 పరుగులకే 4 వికెట్లు తీసి భారత్ ను కష్టాల్లోకి నెట్టింది. యువరాజ్ సింగ్(60,43 బంతుల్లో 5x4 4x6) రాణించడంతో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.
అనంతరం బ్యాటింగ్ మొదలు పెట్టిన ఆసీస్ ఏ దశలోనూ విజయంవైపు సాగుతున్నట్టు కనిపించలేదు. భారత్ బౌలర్లు ముఖ్యంగా స్పిన్నర్లు ఈ ప్రపంచకప్ లో అద్భుతంగా రాణిస్తున్నారు. ఈ మ్యాచ్ లో ఏకంగా ఆస్ట్రేలియాను 86 పరుగులకే కట్టడి చేసి సెమీస్ కళల మీద నీళ్ళు చల్లారు.
అశ్విన్ 4వికెట్లు, అమిత్ మిశ్రా 2 వికెట్లతో రాణించారు.మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా అశ్విన్ ఎన్నికయ్యారు.

No comments:
Post a Comment