Radio LIVE


Breaking News

Saturday, 15 March 2014

పవన్ లాంటి జోకర్లు ఎంతోమంది వచ్చి వెళ్ళిపోయారు:షబ్బీర్ అలీ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు.
కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ ఆలి, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తూర్పార పట్టారు. గతంలో పవన్ పెళ్లి చేసుకోకుండా అక్రమంగా సంసారం చేశాడని అప్పుడు ఆ అమ్మాయి తండ్రి నా దగ్గరకు వచ్చారు.ఆసమయంలో పవన్ పెళ్లి చేసుకోవాలని తాను చెప్పానని షబ్బీర్ అలీ గుర్తు చేశారు. ప్రస్తుతానికి ఆ అమ్మాయిని కూడా వదిలేశాడని అన్నారు.
  రెండు గంటల సినిమా చూపించావు, సుమారు 10 నుండి 12 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి స్టార్ హోటల్లో కాంపెయిన్ మొదలుపెత్తావు. నీ డబ్బులు నీ రాజ్యం ఏమైనా చేసుకో కానీ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడొద్దు అని అన్నారు. నీలాంటి జోకర్లు చాలా మంది వచ్చి నామ రూపాలు లేకుండాపోయారు. కాంగ్రెస్ పార్టీ 129 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది.నీ మద్దతు ఎవరికీ అవసరం లేదు, నిన్ను మాకు ఓటు వేయమని ఎవరు అడగలేదు అని షబ్బీర్ ఆలి అన్నారు.
  దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ అని, బచ్చాగాడి తీరుగా,చిన్నపిల్ల వాడి తీరుగా కాంగ్రెస్ గురించి మాట్లాడకూడదు. నువ్వు సామజిక తెలంగాణా ఇవ్వాలని అనలేదా, నిన్న ఈరోజు వచ్చిన ఉద్యమం కాదు తెలంగాణా అంటే. నీకు చివరగా సలహా ఇస్తున్నాను ,ఆకాశం మీద ఉమ్మితే అది మన మీదే పడుతుంది అని గుర్తుంచుకో, పార్టీ పెట్టుకుంటే పెట్టుకో కాని జాగ్రతగా మాట్లాడడం నేర్చుకో అని షబ్బీర్ ఆలి అన్నారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates