కేంద్ర మంత్రి చిరంజీవి చేతులమీదుగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన 'రేసు గుర్రం' చిత్ర ఆడియోని ఆదివారం హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో విడుదల చేశారు.ఈ వేడుకకి అల్లు అరవింద్,కోట శ్రీనివాస్,వి వి వినాయక్,బ్రహ్మానందం తదితరులు హాజరయ్యారు.
చిరంజీవి సీడీ ఆవిష్కరించగా వినాయక్ స్వీకరించారు.ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ 'రేసు గుర్రం' చిత్రానికి అల్లు అర్జున్ మాత్రమే నప్పుతాడు,ఈ సినిమాకి 'రేసు గుర్రం' అనే పేరు బాగా కుదిరింది. ఎందుకంటే అల్లు అర్జున్ రేసు గుర్రం లాంటి వాడు, అంత చలాకీగా ఉంటాడు బన్నీ ,ఇదివరకు మాఇంట్లో ఏ వేడుక జరిగినా తన డ్యాన్సులు,అనుకరణలు ఉండేవని చెప్పారు.సురేందర్ రెడ్డి మంచి దర్శకుడు అని ,ఈ మధ్యే 'కిక్' సినిమా చూశాను, అప్పుడు రవితేజలా ఉండి ఉంటే ఆ సినిమా నేనే చేసేవాడినేమో అని చిరంజీవి అన్నారు.తమన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి నల్లమలపు శ్రీనివాస్(బుజ్జీ) నిర్మాత,శృతి హసన్ కథానాయిక

No comments:
Post a Comment