ఈ సంవత్సరం చివర్లో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ చెప్పారు.ఇండియా టుడే సదస్సులో పాల్గొన్న సల్మాన్ మాట్లాడుతూ గత కొద్దికాలంగా డేటింగ్ చేస్తున్న రుమేనియా టీవీ నటి లులియా వాంటర్ ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు అన్నారు.రెండున్నరేళ్లుగా తన జీవితంలో ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ కలుగుతోందని,ఇక బ్యాచిలర్ లైఫ్ కి ముగింపు పలకాలని అనుకుంటున్నట్టు సల్మాన్ వెల్లడించారు.తల్లి హిందువు,నా తండ్రి ముస్లిం,రెండవ తల్లి కాథలిక్,బావ పంజాబీ అయితే ఈసారి మా ఇంట్లోకి కోడలు విదేశాల నుంచి వస్తుందేమో అని సల్మాన్ ఖాన్ చమత్కరించారు.తాను కులమతాలకు ప్రాధాన్యం ఇవ్వనని,మానవత్వం అంటే ఇష్టమని,ఇస్లాం, క్రైస్తవ మతాలను నమ్ముతాను అని చెప్పారు.
No comments:
Post a Comment