ఫైనల్లో పాకిస్థాన్‌పై ఐదు వికెట్ల విజయం తో ఐదోసారి ఆసియాకప్ అందుకుంది శ్రీలంక.ఇప్పటిదాకా 12 సార్లు జరిగితే 10 సార్లు ఫైనల్‌కు చేరింది శ్రీలంక.లీగ్ దశలో అన్ని మ్యాచ్‌ల్లోనూ విఫలమైన జయవర్ధనే(93 బంతుల్లో 75; 9 ఫోర్లు; 1 సిక్స్) ఫైనల్ లో మాత్రం అధ్బుతంగా రాణించారు.ఓపెనర్ లాహిరు తిరుమన్నె(108 బంతుల్లో 101; 13 ఫోర్లు)తో కలిసి మూడో వికెట్‌కు 156 పరుగులు జోడించడంతో విజయంలో కీలక పాత్ర పోషించారు.షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో శనివారం జరిగిన ఫైనల్లో మాథ్యూస్ బృందం ఐదు వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించి టైటిల్ ఎగురేసుకుపోయింది.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాక్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 260 పరుగులు చేసింది.మలింగ(5/56) ధాటికి 18 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన పాక్‌ను ఫవాద్ ఆలం(134 బంతుల్లో 114 నాటౌట్; 8 ఫోర్లు; 3 సిక్స్‌లు)కెప్టెన్ మిస్బా(98 బంతుల్లో 65; 3 ఫోర్లు; 2 సిక్స్ లు)ఆదుకున్నారు.నాలుగో వికెట్‌కు 122 పరుగులు జోడించాడు. చివర్లో ఉమర్ అక్మల్ (42 బంతుల్లో 59; 7 ఫోర్లు) వేగంగా ఆడాడు.మొత్తం ఐదు వికెట్లూ మలింగనే తీయడం విశేషం.మలింగకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’,తిరిమన్నెకు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.

No comments:
Post a Comment