టీ20 వరల్డ్ కప్ లో మరొక ఆసక్తికర మ్యాచ్ జరిగింది. ఈరోజు
జరిగిన మొదటి మ్యాచ్ రెండు మ్యాచ్ లు ప్రేక్షకులకు కనువిందు చేశాయి.
శ్రీలంక,ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఆసక్తికర మ్యాచ్ లో ఇంగ్లాండ్ 6వికెట్ల
తేడాతో విజయం సాధించింది.
శ్రీలంక విసిరిన 190 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఇంకా నాలుగు బంతులుండగానే ఛేదించి ఫామ్ లో ఉన్న శ్రీలంకకు షాక్ ఇచ్చింది.మొదటి ఓవర్ లోనే రెండు వికెట్లు కోల్పోయి పరుగులేమి లేకుండానే 2వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ ను హేల్,మోర్గాన్ లు 3 వ వికెట్ కు 150 పరుగుల భాగస్వామ్యం తో ఆదుకున్నారు. మోర్గాన్ 57 పరుగులకు ఔట్ అయినా హేల్(116) అధ్బుత సెంచరీతో ఇంగ్లాండ్ కు విజయాన్ని అందించాడు. కులశేఖర నాలుగు వికెట్లతో రాణించాడు.
అంతకముందు టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత శ్రీలంకను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఆదిలోనే పెరేరా ఔట్ అయినా జయవర్ధనే(89),దిల్షాన్(55) రాణించడంతో 20 ఓవర్లలో4 వికెట్ల నష్టానికి189 పరుగులు చేసింది.

No comments:
Post a Comment