ఆతిథ్య జట్టు బంగ్లాదేశ్ పై వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. డిఫెండింగ్
ఛాంపియన్ గా బరిలోకి దిగిన వెస్టిండీస్ తన మొదటి మ్యాచ్ లో భారత్ చేతిలో
ఓడిపోయిన సంగతి తెలిసిందే. టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్
20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. స్మిత్ 72 పరుగులు,
గేల్ 48 పరుగులతో రాణించారు.
172 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఏ దశలోనూ పోరాడినట్టు
కనిపించలేదు. 19.1 ఓవర్లలో 98 పరుగు చేసి ఆలౌట్ అయింది. బద్రి 4 వికెట్లు
తీసుకున్నాడు. స్మిత్ మ్యాన్ అఫ్ ద మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు.
No comments:
Post a Comment