ఈరోజు జరిగిన టీ20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టుకు
పసికూన హాంకాంగ్ షాకిచ్చింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా నిర్లక్షంగా
ఆడింది, కేవలం 108 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. స్వల్ప విజయ
లక్ష్యంతో బ్యాటింగ్ మొదలుపెట్టిన హాంకాంగ్ తడబడుతూ లక్ష్యాన్ని
చేధించింది. టెస్ట్ హోదా ఉన్న ఒక దేశం పై గెలవడం హాంకాంగ్ కు ఇదే మొదటి
సారి. ఓడినా మెరుగైన రన్ రేట్ సహాయంతో బంగ్లాదేశ్ సూపర్-10 కు అర్హత
సాధించింది.
No comments:
Post a Comment