మీర్పూర్ : టీ20 ప్రపంచకప్ ఆతిథ్య జట్టు బంగ్లాదేశ్ టోర్నిలో
వరుసగా 3వ ఓటమి చవిచూసింది. పాకిస్తాన్ చేతిలో 50 పరుగుల తేడాతో ఓటమి చవి
చూసింది. దీంతో పాకిస్తాన్ సెమిఫైనల్ ఆశలు సజీవంగా ఉంచుకుంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 5 వికెట్ల నష్టానికి 190 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ అహ్మద్ షెహజాద్(62 బంతుల్లో 111 పరుగులు) సెంచరీ తో రాణించాడు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా జట్టు 20ఓవర్లలో 140 పరుగులు మాత్రమే చేయగలిగింది. సెమీస్ ఆశలు కోల్పోయిన బంగ్లా తన చివరి మ్యాచ్ లో ఆస్ట్రేలియా తో తలపడుతుంది. ఇక పాకిస్తాన్ సెమీస్ చేరాలంటే చివరి మ్యాచ్ లో వెస్టిండీస్ పై గెలవాలి,లేదంటే వెస్టిండీస్ సెమీస్ కు చేరుతుంది.