ఏటీఎంలలో లావాదేవీలకు సంబంధించి నవంబర్ 1 నుండి కొత్త నిబంధనలు అమలులోకి
రానున్నాయి.సొంత బ్యాంకు ఏటీఎం నుండి నెలకు ఐదుసార్లకు మించి డబ్బులు
తీసుకున్నా,బ్యాలెన్స్ చెక్ చేసుకున్నా,మినీ స్టేట్ మెంట్ లాంటివి
తీసుకున్నా ప్రతీ లావాదేవికి రూ.20 అదనంగా చార్జీ చేస్తారు.అంటే సొంత
బ్యాంకు ఏటీఎం నుండి ఉచితంగా లావాదేవీలు జరుపుకోవడానికి 5 సార్లే అవకాశం
ఉంది.అదే ఇతర ఏటీఎంల ద్వారా లావాదేవీలు ఉచితంగా జరుపుకునే అవకాశం ఐదు నుండి
మూడుకు తగ్గించారు.మెట్రో నగరాల్లో మూడు లావాదేవీలు, నాన్ మెట్రో నగరాల్లో
రెండు లావాదేవీలు నిర్వహించుకునే అవకాశం కల్పించింది ఆర్బీఐ.
ఈ నిబంధనలు దేశంలోని కేవలం ఆరు మెట్రో నగరాలకే వర్తిస్తాయి.హైదరాబాద్ తో
పాటు ఢిల్లీ,ముంబాయి,కోల్ కతా,చెన్నై,బెంగళూరులలో మాత్రమే ఈ నిబంధనలు
వర్తిస్తాయి.ఈ మార్పులు కరెంటు మరియు సేవింగ్స్ కు సంబంధించిన అన్ని
అకౌంట్లకు వర్తిస్తాయి.
Breaking News
Friday, 31 October 2014
‘కరెంటు తీగ’ సినిమా రివ్యూ
నటీనటులు : మంచు మనోజ్,రకుల్ ప్రీత్ సింగ్,జగపతిబాబు,సన్నీ లియోన్,సంపూర్నేష్ బాబు,తాగుబోతు రమేష్,వెన్నెల కిశోర్,సుప్రీత్
దర్శకత్వం : జి నాగేశ్వరరెడ్డి
సంగీతం : అచ్చు
నిర్మాత : మంచు విష్ణు
విడుదల : 31 అక్టోబర్ 2014
తమిళంలో సూపర్ హిట్టైన ‘వర్తపడు వాలిబర్ సంఘం’కు రీమేక్ గా తీసిన చిత్రమే ‘కరెంటు తీగ’.మినిమమ్ గ్యారంటీ అని పేరున్న దర్శకుడు జీ నాగేశ్వర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకుడు.బిజీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్రంలో మనోజ్ కు జంటగా కనిపించింది.జగపతిబాబు ముఖ్య పాత్రలో నటించారు.మంచు విష్ణుకు దేనికైనా రెడీ తో మంచి హిట్ ఇచ్చినా నాగేశ్వర్ రెడ్డి కరెంటు తీగతో మనోజ్ కు కూడా హిట్ ఇచ్చాడో లేదో చూద్దాం.
కథ :
పార్వతీపురం అనే గ్రామానికి శివరామరాజు(జగపతిబాబు) పెద్ద.ఆయనకు ముగ్గురు కూతుళ్ళు,వారిలో ఒకరు కవిత(రకుల్ ప్రీత్ సింగ్).అదే గ్రామానికి చెందిన వీర్రాజు(సుప్రీత్)తో శివరామరాజుకు వైరం ఉంటుంది.నా కూతుళ్ళలో ఎవరు ఎవరినీ ప్రేమించి పెళ్లి చేసుకోరని అలా చేసుకుంటే నా చెవులను కోసుకుంటాను లేదా వారిని చంపేస్తానని శపథం చేస్తాడు శివరామరాజు తన బద్ద శత్రువైన వీర్రాజుతో.
అదే ఊరిలో ఉంటున్న రాజు(మనోజ్) వీఐపీ సంఘాన్ని ఏర్పాటు చేసుకొని దానికి అధ్యక్షుడిగా ఉంటూ మంచి పనులు చేస్తుంటాడు.అయితే ఆ గ్రామ పాఠాశాలలో టీచర్ గా పనిచేస్తున్న సన్నీ(సన్నీ లియోన్)ను రాజు ప్రేమిస్తాడు.తన ప్రేమకు మధ్యవర్తిగా అదే స్కూల్ లో చదువుతున్న కవితను ఎంచుకుంటాడు.వీరి ప్రేమ కథకు కవిత సహాయం చేసిందా?లేకుంటే కవిత,రాజు ప్రేమలో పడుతుందా?వీరిద్దరి ప్రేమను జగపతిబాబు బ్రతికించి చెవులు కొసుకుంటాడా?మొదలగునవి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:
మంచు మనోజ్,జగపతి బాబు నటన
కామెడీ
రకుల్ ప్రీత్ సింగ్ ప్రాముఖ్యత ఉన్న పాత్ర,సన్నీ గ్లామర్
క్లైమాక్స్
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
రొటీన్ కథ
సెకండ్ హాఫ్
స్క్రీన్ ప్లే స్లో
హీరోకు విలన్ కు మధ్య ఫైట్ దృశ్యాలు
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన చిత్రం ‘కరెంటు తీగ’ ఒక విధంగా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను తృప్తి పరచలేదు అని చెప్పవచ్చు.కామెడీ పర్వాలేదు అనిపించినప్పటికీ కథ రొటీన్ అనే ఫీలింగ్ సినిమా చూస్తుంటే కలుగుతుంది.సెకండ్ హాఫ్ బోర్ కొట్టిస్తుంది.స్క్రీన్ ప్లే,దర్శకత్వం వహించిన నాగేశ్వర్ రెడ్డి సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే నడిపించడంలో వెనకపడ్డాడు.మంచు మనోజ్ ఈ సినిమాలో లావుగా కనిపిస్తాడు,విలేజ్ బ్యాక్ డ్రాప్ కావడంతో అది కాస్త ప్లస్ అయింది.ఇక సన్నీ లియోన్ గ్లామర్,రకుల్ ప్రీత్ సింగ్ నటన బాగుంటాయి.అచ్చు సంగీతం సాదాసీదాగా ఉంది.మంచు విష్ణు నిర్మాణ విలువలు బాగా రిచ్ గా ఉన్నాయి.తమిళ్ నుండి రీమేక్ అయిన ఈ సినిమాలో అక్కడక్కడా తమిళ్ షేడ్స్ కనిపిస్తాయి.
చివరగా ‘కరెంటు తీగ’ మనోజ్ కెరీర్ లో పెద్ద హిట్టా?కాదా అనేది ప్రేక్షకులే తేల్చాలి,అందుకు కొన్ని రోజలు ఆగాల్సిందే.
రేడియో జల్సా రేటింగ్ : 3/5
Labels:
Telugu Cinema News
Thursday, 30 October 2014
ఐఎస్ఎస్ఎఫ్ అథ్లెట్ల కమిటీ ఛైర్మెన్ గా అభినవ్ బింద్రా
భారత స్టార్ షూటర్, ఒలంపిక్ స్వర్ణ విజేత అభినవ్ బింద్రాకు అరుదైన గౌరవం
దక్కింది. అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య( ఐఎస్ఎస్ఎఫ్ ) అథ్లెట్ల కమిటీ
ఛైర్మెన్ గా అభినవ్ బింద్రా ఎంపికయ్యాడు. అథ్లెట్ల కమిటీకి ఛైర్మెన్ తో
పాటు ఐఎస్ఎస్ఎఫ్ అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ లో సభ్యునిగా కూడా బింద్ర
వ్యవహరిస్తాడు. ఇండియా నుండి ఈ గౌరవం దక్కించుకున్న తొలి అథ్లెట్ అభినవ్
బింద్రానే.
Labels:
International News,
National News,
Sports News
నేను గే ఐనందుకు గర్విస్తున్నా : ఆపిల్ సిఈవో టిమ్ కుక్
బ్లూమ్ బర్గ్ బిసినెస్ వీక్ లో రాసిన ఓ కథనంలో ఆపిల్ కంపనీ సీఈవో టిమ్ కుక్
తాను 'గే' నని బహిరంగంగా పేర్కొన్నాడు. ఇతరులు సెక్స్ ఓరియంటేషన్ తెలపడంలో తన
మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. తాను 'గే' నని బహిరంగంగా ప్రకటించిన అమెరికన్
కంపెనీ సీఈవోల్లో టిమ్ కుక్ మూడవ వాడు. తాను 'గే' గా జీవించడం దేవుడిచ్చిన
వరమని ఆయన అన్నారు.'గే' నని ప్రకటించినందుకు గాను ట్విట్టర్ లో టిమ్ కుక్ కు
ప్రశంశలు వెల్లువెత్తాయి. మొదటి నుంచి ఆపిల్ కంపెనీ లెస్బియన్, బై
సెక్సువల్, గే, ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ హక్కులకు మద్దతు తెలుపుతుంది.
తాను 'గే' అన్న విషయం కంపెనీలో పనిచేసే సహోద్యోగులకు చాలా మందికి తెలుసు,అయినప్పటికీ ఏఒక్కరూకూడా నన్ను అదోలా చుడడంగానీ,మాట్లాడడంగానీ చేయలేదు అని కుక్ చెప్పారు.
తాను 'గే' అన్న విషయం కంపెనీలో పనిచేసే సహోద్యోగులకు చాలా మందికి తెలుసు,అయినప్పటికీ ఏఒక్కరూకూడా నన్ను అదోలా చుడడంగానీ,మాట్లాడడంగానీ చేయలేదు అని కుక్ చెప్పారు.
Labels:
International News
మార్క్ ఫెడ్ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష
మార్క్ ఫెడ్ అధికారులతో తెలంగాణా సీఎం కేసీఆర్ సమీక్షా నిర్వహించారు.
రైతులను మొక్కజొన్న కొనుగోలులో ఇబ్బంది పెట్టవద్దని కేసీఆర్ అధికారులకు
ఆదేశాలు జారీ చేశారు. సైజ్ తో నిమిత్తం లేకుండా మొక్కజోన్నాను కొనుగోలు
చేయాలనీ ఆదేశించారు. మొక్కజొన్న ఏ గ్రేడ్ కు ధర రూ.1310 , బి గ్రేడ్ కు
రూ.1230లు ప్రభుత్వం చెల్లిస్తుందని సీఎం తెలిపారు.
Labels:
Telangana News
2,3 తేదీల్లో సిఎం కేసిఆర్ ఛత్తీస్ గఢ్ పర్యటన
తెలంగాణ సీఎం కేసీఆర్ ఛత్తీస్ గఢ్ పర్యటన తేదీలు ఖరారయ్యాయి. చంద్రశేఖర్
వచ్చేనెల 2, 3 తేదీలలో అధికారికంగా చత్తీస్ గఢ్ లో పర్యటించనున్నారు.ఆయన ఈ
సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో తెలంగాణకు కావాల్సిన విద్యుత్ ఒప్పందం
చేసుకోనున్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ మేరకు సంతకాలు
చేయనున్నారు. ఛత్తీస్ గఢ్ కు సీఎంతో పాటు ఇందన వనరుల కార్యదర్శి కూడా
వెళ్లనున్నారు.
Labels:
National News,
Telangana News
తమిళ జాలర్లకు ఉరిశిక్ష
కొలంబో కోర్ట్ భారత్ కు చెందిన ఐదుగురు తమిళ జాలర్లకు ఉరిశిక్ష విధించింది.
2011 లో మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్నారనే నెపంతో శ్రీలంక
ఎనిమిది మంది జాలర్లను అదుపులోకి తీసుకుంది. ఇప్పుడు వారిలోని ఐదుగురికి
శిక్ష ఖరారు అయ్యింది. తమిళులు దీనికి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరంతా
రామేశ్వరం పరిసర గ్రామాలకు చెందినవారు.
Labels:
National News
Wednesday, 29 October 2014
ఆ కథానాయికను ఆమే తల్లికి అప్పగించండి : కోర్టు
కథానాయిక శ్వేతాబసు ప్రసాద్ బంజారాహిల్స్ లోని ఓ హోటల్లో వ్యభిచారం చేస్తూ
పట్టుబడిన పట్టుబడిన విషయం తెలిసిందే. శ్వేతా బసు అరెస్టు అయిన తర్వాత
పోలీసులు ఆమెను సంరక్షణ గృహానికి తరలించారు. ఆ నటిని 6 నెలల పాటు సంరక్షణ
గృహంలో ఉంచాలన్న ఎర్ర మంజిల్ కోర్ట్ ఆదేశాలను నాంపల్లి కోర్టు
కొట్టివేసింది. వ్యభిచారం చేస్తూ పట్టుబడిన ఆ నటిని ఆమె తల్లికి
అప్పగించాలని కోర్టు ఆదేశాలను జారీ చేసింది.
Labels:
Telugu Cinema News
పట్టణాన్ని ముంచెత్తనున్న హవాయి దీవుల్లోని కిలోయియా లావా
హవాయి దీవుల్లోని కిలోయియా అగ్నిపర్వతం లావాను నిరంతరాయంగా
చిమ్ముతుండడంతో ఓ పట్టణానికి ప్రమాదం ముంచుకొచ్చింది. ఈ అగ్నిపర్వతం లావా
జూన్ 27 నుంచి చిమ్మడం మొదలై ఇప్పుడు పహోవ పట్టణ సమీపానికి దూసుకొచ్చింది.
ఇప్పటికే శ్మశాన వాటికను మింగేసి, ఆ పట్టణంలోని మొదటి గృహాన్ని
ముంచెత్తబోతుంది. గంటకు 10 మీ.గా లావా ప్రవాహం ఉంది. దీని ఉష్ణోగ్రత 900
డిగ్రీల సెల్సియస్ గా ఉంది. లావా ప్రవాహ దిశలో ఉన్న దుకాణాలను, పాఠశాలను
ఇప్పటికే మూసివేశారు.
Labels:
International News
హుదూద్ ను ప్రేమిస్తున్నానందుకు న్యాయ విద్యార్ధి అరెస్ట్
ఫేస్ బుక్ ప్రేమికులారా.. జాగ్రత్తగా పోస్టులు చేయండి. గుంటూరుకు చెందిన
న్యాయ విద్యార్థి చేసిన పోస్ట్ అతని అరెస్టుకు దారి తీసింది .అతను చేసిన
తప్పు ఏమిటంటే హుదూద్ తుఫాన్ ను నేను ప్రేమిస్తున్నాను. ఎందుకంటే ప్రకృతిని
నాశనం చేస్తున్న వారిని అది శిక్షించింది. దేవుడు అనేవాడు ఉన్నాడని ఫేస్
బుక్ లో కామెంట్ పెట్టాడు. అంతే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. హుదూద్
తుఫాన్ వల్ల ప్రజలకు భారీగా నష్టం వాటిల్లింది. 20 మంది ప్రాణాలు
కోల్పోయారు. ఇంత వినాశనం జరిగితే హుదూద్ తుఫాన్ ను ప్రేమిస్తున్నానని
కామెంట్లు చేయడంపై పోలీసులు మండిపడ్డారు.
Labels:
National News
క్యూబాపై ఆంక్షల ఎత్తివేతకు భారత్ మద్దతు
జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్ తో సహా 187 దేశాలు
అనుకూలంగా ఓటు వేశాయి. ఈ 23 ఏళ్ళుగా అమెరికా కొనసాగిస్తున్న ఆర్ధిక,
వాణిజ్య , విత్త ఆంక్షలకు స్వస్తి పలకాలని ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని
ఎప్పటిలాగే యూఎస్ , ఇజ్రాయెల్ వ్యతిరేకించాయి. మైక్రోనేషియా, పలావు ,
మార్షల్ దీవులు ఓటింగ్ కు గైర్హాజరయ్యాయి.
Labels:
International News
డిసెంబర్ 3కు నల్లధనం కేసు విచారణ వాయిదా
సుప్రీం కోర్ట్ కు కేంద్రప్రభుత్వం మూడు జాబితాలతో కూడిన 627 మంది నల్ల
కుబేరుల పేర్లను స్టీల్ కవర్లో ఉంచి సమర్పించింది. సుప్రీం ఈ కేసు విచారణపై
స్పందిస్తూ.. నల్లదనం కేసులో తదుపరి కార్యాచరణను సిట్ నిర్ధారిస్తుంది.
సీల్డ్ కవర్ లోని జాబితాను సిట్ అధ్యక్ష, ఉపాధ్యక్షులే తెరవాలి. సిట్ ముందు
విదేశీ ఒప్పందాలతో ఉన్న ఇబ్బందులను ఉంచవచ్చు.నవంబర్ లోపు కోర్ట్ కు సిట్
దర్యాప్తు పురోగతి నివేదికను సమర్పించాలి. తదుపరి నల్లదనం విచారణ కేసును
డిసెంబర్ 3 తేదిన వాయిదా వేస్తున్నట్లు సుప్రీం కోర్ట్ పేర్కొంది.
Labels:
National News
Tuesday, 28 October 2014
అమ్మాయిల శవాలు దొంగిలించడం,ఇంట్లో పెట్టుకోవడం..అతని వృత్తి
స్మశానంలో సమాధులను
త్రవ్వడం,పూడ్చిపెట్టిన బాలికల శవాలను శవపేటిక నుండి దొంగిలించి ఇంట్లో
పెట్టుకొని వాటిని అందంగా అలంకరించి బొమ్మాల్లా తయారు చేయడం అతని సరదా.గత
పది సంవత్సరాలుగా అతనికి ఇదే పని.
పది సంవత్సరాల తరువాత తన కూతురు సమాధిలో ఖాళీ శవపేటిక మాత్రమే ఉందని
గ్రహించిన ఒక తల్లి మనోవేదనతో జరిగిన విషయాన్ని పోలిసులకు తెలిపింది.
వివరాల్లోకి వెళ్తే :
పది సంవత్సరాల క్రితం ఓల్గా అనే పది సంవత్సరాల వయసున్న బాలికను ఇంటి బయట
ఒకడు డ్రగ్స్ మత్తులో రాడ్ తో తల మీద బాది చంపేశాడు.ఓల్గాను తల్లిదండ్రులు
అక్టోబర్ 2,2002 సంవత్సరంలో శవపేటికలో పెట్టి సమాధిలో పూడ్చి
పెట్టారు.మే7,2003న ఓల్గా సమాధికి పెయింట్ వేసి చుట్టూ చిన్న కంచే వేశారు
బాలిక తల్లిదండ్రులు.మరుసటి రోజు సమాధి దగ్గరకు వచ్చిన బాలిక
తల్లిదండ్రులు సమాధిని ఎవరో తాకారు అని తెలుసుకున్నారు,అంతకముందు రోజు
సమాధిమీద ఉంచిన పుష్పగుచ్చం పక్కకు జరిగి ఉండడంతో వారికి అనుమానం
వచ్చింది.అప్పుడప్పుడు ఆ సమాధిమీద ఏవేవో రాతలు,కొన్ని సందర్భాలలో
పుష్పగుచ్చాలు,బొమ్మలు కనిపించేవి.భయపడిన ఓల్గా తల్లిదండ్రులు పోలీసులకు
కూడా కంప్లైంట్ చేశారు.
కాని సరిగ్గా 10 సంవత్సరాల తరువాత తమ కూతురు శవం సమాధిలో లేదని తెలుసుకున్న
బాలిక తల్లి నటాలియా రోదిస్తూ ఏమీ తెలియని 10 సంవత్సరాల చిన్నారిని
చంపేశారని,తన ఆత్మ స్వర్గంలో విశ్రాంతి తీసుకుంటుంది అనుకున్నాను కాని ఇలా
శవాన్ని కూడా దొంగిలిస్తారని అనుకోలేదని వాపోయింది.
ఇదంతా చేసింది మేధావి అని చెప్పుకునే 46 సంవత్సరాల రష్యా చిత్రకారుడు అనటోలి మోస్క్విన్.నిజానికి విషయం తెలుసుకున్న పోలీసులు అనటోలిని 2011 లోనే అరెస్ట్ చేశారు.అతని ఇంట్లో సోదా చేయగా 29 శవాలు కనిపించాయి.కుళ్ళిపోయిన శవాలకు,అస్థిపంజరాలకు పిల్లలు ఆడుకునే బొమ్మల్లా అలంకరణలు చేసి ఇంట్లో భద్రపరుచుకునే వాడు.పోలీసులు స్వాధీనం చేసుకున్న 29 శవాల్లో మీ కూతురు శవం ఉందో చూసుకోండి అని పోలీసులు చెప్పడంతో ఓల్గా సమాధిని త్రవ్వి చూడగా కేవలం పెద్ద రంధ్రంతో ఉన్న శవపేటిక మాత్రమే కనిపించింది. పది సంవత్సరాలుగా కేవలం శవపేటికనే దర్శించుకుంటున్నామా అని ఓల్గా తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
అనటోలి విషయానికి వస్తే 3 నుండి 12 సంవత్సరాల వయసున్న బాలికల శవాలను దొంగిలించి ఇంట్లో పెట్టుకునేవాడు.ఎందుకు అలా చేశావ్ అని కోర్టు ప్రశ్నిస్తే పొంతనలేని,నమ్మశక్యం కాని వాదనలు వినిపించాడు.బాలికల సమాధుల దగ్గరకు వెళ్ళినప్పుడు అవి నాతో మాట్లాడేవని,మమ్ముల్ని ఇక్కడినుండి తీసుకుపొమ్మని చెప్పేవని చెప్పుకొచ్చాడు. నిందితుడి తల్లిదండ్రులను ప్రశ్నిస్తే వారు వింత సమాధానాలు చెప్పారు.మా అబ్బాయి తీసుకువచ్చేవి బొమ్మలే అని అనుకుంటున్నామని ముసలి తల్లిదండ్రులు చెప్పారు. అతను మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని తెలుసుకున్న కోర్టు మానసిక చికిత్స నిమిత్తం మెంటల్ హాస్పిటల్ కు తరలించాలని పోలీసులకు సూచించింది.

Monday, 27 October 2014
జంక్ ఫుడ్ అలవాటుకు సోషల్ మీడియా కూడా ఓ కారణమంటున్న సర్వే
ఈ మధ్యకాలంలో పిల్లలు ఫిజ్జా, బర్గర్ తదితర జంక్ ఫుడ్ లపై విపరీతమైన ఆసక్తి
చూపుతున్నారు. పిల్లలు ఇంతగా ఈ తరహ తిండికి అలవాటు పడటానికి సోషల్ మీడియా
కూడా ఓ కారణమని ఆస్ట్రేలియాలోని సిడ్నీలో చేపట్టిన ఓ సర్వే వెల్లడించింది.
జంక్ ఫుడ్ కు సంబంధించి ఫేస్ బుక్ తదితర సోషల్ సైట్లలో మార్కెటింగ్
ఎక్కువగా ఉంటుందని దీంతో వీటిపై పిల్లలు అమితమైన ఆసక్తి చూపుతున్నారని
సర్వే తెలిపింది. జంక్ ఫుడ్, శీతల పనియలకు సంబంధించిన ఫేస్ బుక్ పేజీలను
టీనేజ్ పిల్లలు ఎక్కువగా లైక్ చేస్తున్నట్లు ఈ సర్వేలో తేలింది.
Labels:
International News,
National News
బౌద్ధ పుణ్యక్షేత్రం బుద్ధగయను సందర్శించిన వియత్నాం ప్రధాన మంత్రి
సోమవారం బీహార్ లోని ప్రముఖ బౌద్ధ పుణ్యక్షేత్రం బుద్ధగయను వియత్నాం
ప్రధాన మంత్రి నగుయిన్ టాన్ జింగ్ సందర్శించారు. ఆయనకు బీహార్ ముఖ్యమంత్రి
జితిన్ రామ్ మాంఝీ గౌతమ బుద్ధ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం
పలికారు. అనంతరం వారు మహాబోది ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు
నిర్వహించారు. బీహార్ లో పర్యాటక రంగంలో పెట్టుబడులను విసృతం చేసే అంశంపై ఈ
సందర్భంగా వియత్నాం ప్రధాని మాంఝీతో చర్చించారు.
Labels:
International News,
National News
దాశరధి కృష్ణమాచార్యులు కుమారుడు లక్ష్మణాచార్యులకు ప్రభుత్వ ఉద్యోగం
కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు దాశరధి కృష్ణమాచార్యులు కుమారుడు
లక్ష్మణాచార్యులకు ప్రభుత్వ ఉద్యోగం లభించింది. నెట్ వర్క్ ఇంజనీరింగ్ గా
ఐటీ డిపార్ట్ మెంట్ లో ప్రభుత్వం లక్ష్మణాచార్యులకు ఉద్యోగం ఇచ్చింది. ఈ
క్రమంలో ఐటీ మంత్రి కేటీఆర్ లక్ష్మణాచార్యులకు అపాయింట్మెంట్ లేఖను
అందజేశారు.
Labels:
Telangana News
సౌత్ ఆఫ్రికా ఫుట్ బాల్ కెప్టెన్ ను కాల్చి చంపిన దుండగులు
సౌత్ ఆఫ్రికా ఫుట్ బాల్ కెప్టెన్ సెన్ జో మేయవాను జోహేన్స్ బర్గ్ లోని తన
సొంత ఇంట్లోనే దుండగులు కాల్చి చంపారు. అక్కడి మీడియా ప్రకారం దుండగులు
అతడి ఇంట్లో ఆదివారం దోపిడీకి చొరబడి సెన్ జో ను చంపి ఉంటారని పోలీసులు
భావిస్తున్నారు. ఇంట్లో చొరబడిన వారిలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారని, మరో
వ్యక్తి బయట ఉన్నాడని వారు తెలిపారు.
Labels:
International News,
Sports News
Saturday, 25 October 2014
గూగుల్ ఉత్పత్తులు, సర్వీసుల ఇంఛార్జిగా సుందర్ పిచయ్
భారత్ కు చెందిన సుందర్ పిచయ్ ను గూగుల్ సంస్థ ఉత్పత్తులు, సర్వీసుల
ఇంఛార్జిగా నియమించారు.సుందర్ పిచయ్ తమిళనాడు రాజధాని చెన్నైలో
జన్మించారు.ఖరగ్ పూర్ ఐఐటీ లో విద్యనభ్యసించారు.అనంతరం 2004 లో గూగుల్ లో
చేరారు. గూగుల్ సీఈఓ లారీ పేజ్ ఈ పదవిలో పిచయ్ ను నియమించినట్లు గూగుల్
అధికార ప్రతినిధి వెల్లడించారు. సంస్థలో కీలక స్థానంలో ఉన్న సుందర్ గూగుల్
సెర్చ్, గూగుల్ ప్లస్ మ్యాప్స్, అడ్వర్టైసింగ్ తదితర విభాగాలను
పర్యవేక్షిస్తారని తెలిపారు. అలాగే క్రోమ్ సాఫ్ట్ వేర్ ఆపరేటింగ్ సిస్టమ్,
ఆండ్రాయిడ్ , గూగుల్ యాప్స్ బిసినెస్ పర్యవేక్షణనూ కొనసాగిస్తారని
అధికారులు తెలిపారు.
సినిమా రివ్యూ : కార్తికేయ
సినిమా రివ్యూ : కార్తికేయ
విజన్ 2020 ప్రణాళికలో భాగంగా బ్యాటింగ్ సలహాదారుగా VVS లక్ష్మణ్
“రాష్ట్రీయ్ ఏక్తాదివస్ “గా సర్దార్ వల్లభ్ బాయ్ పటేల్ జయంతి
నవంబర్ 19 న ప్రధాని మోడీ ఫిజీ పర్యటన
నవంబర్ 19 న భారత ప్రధాని మోడీ
ఫిజీలో పర్యటించనున్నారు.నవంబర్ 12,13 తేదీల్లో మయన్మార్ రాజధాని నేపైతాలో
నిర్వహించే తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశం (ఈఏఎస్)లో ప్రధాని తొలుత
పాల్గొంటారు. అక్కడి నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లి 15,16 తేదీల్లో బ్రిస్బెస్
లో జరిగే జీ-20 సమావేశాల్లో పాల్గొంటారు.అనంతరం 18 న ఆస్ట్రేలియా ప్రధాని
అబోట్ తో కాన్బెర్రాలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. నవంబర్ 19న ఫిజీలో
పర్యటిస్తారు.నవంబర్ 26 న నేపాల్ లో నిర్వహించనున్న సార్క్ శిఖరాగ్ర
సదస్సుకు ప్రధాని మోడీ హాజరు కానున్నారని తెలుస్తున్నది.
1948 అక్టోబర్ 24 న ఐక్యరాజ్య సమితి ఆవిర్భవించింది. ఐ.రా.స ఆవిర్భావ దినం సందర్భంగా శుక్రవారం మోడీ శుభాకాంక్షలు తెలుపుతూ ఐ.రా.స సభ్య దేశాలు ప్రపంచ శాంతి, సౌభాగ్యం కోసం పాటు పడాల్సిన సమయమని మోడీ పేర్కొన్నారు.
1948 అక్టోబర్ 24 న ఐక్యరాజ్య సమితి ఆవిర్భవించింది. ఐ.రా.స ఆవిర్భావ దినం సందర్భంగా శుక్రవారం మోడీ శుభాకాంక్షలు తెలుపుతూ ఐ.రా.స సభ్య దేశాలు ప్రపంచ శాంతి, సౌభాగ్యం కోసం పాటు పడాల్సిన సమయమని మోడీ పేర్కొన్నారు.
Labels:
International News,
National News
“రాష్ట్రీయ్ ఏక్తాదివస్ “గా సర్దార్ వల్లభ్ బాయ్ పటేల్ జయంతి
కేంద్ర ప్రభుత్వం భారతదేశ మొట్టమొదటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్
జయంతి అక్టోబర్ 31 ని జాతీయ ఐక్యాత దినంగా (రాష్ట్రీయ్ ఏక్తా దివస్ గా)
నిర్వహించాలని నిర్ణయించింది.ఈ మేరకు శుక్రవారం కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్
సింగ్ ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు.కాగా కేంద్ర క్యాబినెట్ మహాత్మా గాంధీ
మినహా ఇతర జాతీయ నాయకుల జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహించబోమని
నిర్ణయం తీసుకున్న వారంలోపలే రాష్ట్రీయ్ ఏక్తా దివస్ గా పటేల్ జయంతిని
ప్రకటించడం విశేషం.
Labels:
National News
విజన్ 2020 ప్రణాళికలో భాగంగా బ్యాటింగ్ సలహాదారుగా VVS లక్ష్మణ్
ఈడెన్ గార్గేన్స్ లో 10 టెస్టుల్లో 5 సెంచరీలు.. 110.63 సగటుతో 1217 పరుగుల
వరద పారించి కోల్ కతా దత్తపుత్రుడిగా పేరొందిన వీవీఎస్ లక్ష్మణ్ ఆ
చారిత్రక స్టేడియంలో మరోసారి తన తడాఖా చూపనున్నాడు.. ఈసారి తన బ్యాటుతో
కాదు.. యువ క్రికెటర్లకు ఎలా పరుగులు రాబట్టాలో తర్పీద్ నివ్వడం ద్వారా.
అవును నిజమే.. ఈ హైదరాబాద్ బ్యాట్ మన్ ను క్యాబ్ (బెంగాల్ క్రికెట్ సంఘం) విజన్ 2020 ప్రణాళికలో భాగంగా బ్యాటింగ్ సలహాదారు( కన్సల్టెంట్ )గా నియమించుకుంది. క్యాబ్ సంయుక్త కార్యదర్శి సౌరబ్ గంగూలి లక్ష్మణ్ కు కీలక బాధ్యతలు అప్పగించడంలో ప్రత్యేక చొరవ చూపించాడు. లక్ష్మణ్ క్యాబ్ బ్యాటింగ్ సలహాదారుగా తన నియామకం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ .. తనకెంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిన ఈడెన్ గార్డెన్స్ ఋణం తీర్చుకునే అవకాశం లభించిదన్నారు.

రేడియో జల్సా రేటింగ్ : 3.25/5.00
విడుదల : అక్టోబర్ 24,2014
దర్శకత్వం : చందూ మొండేటి
నిర్మాత : వెంకట శ్రీనివాస్ బొగ్గరం
సంగీతం : శేఖర్‌చంద్ర
తారాగణం : నిఖిల్,స్వాతీ రెడ్డి,రావు రమేష్,ప్రవీణ్,తనికెళ్ళ భరణి,తులసి
కథ
ద్రవిడుల కాలంలో సుబ్రమణ్యేశ్వరపురం అనే ఊరిలో సుబ్రమణ్యస్వామికి గుడి కడతారు.ప్రతి యేటా కార్తీక పౌర్ణమి నాడు ఆ ఆలయం నుండి వెలుగులు ప్రసరించడం ఒక అధ్బుతం.అనుకోకుండా కొన్ని అనర్థాలు చోటు చేసుకోవడం,పాము కాటుతో అందరూ చనిపోతుండడం వల్ల గుడిని 2013 సంవత్సరంలో మూసేస్తారు.
కార్తీక్(నిఖిల్) మెడిసన్ చివరి సంవత్సరం చదువుతుంటాడు.కార్తిక్ కు మూడనమ్మకాలు అంటే గిట్టవు.తన బ్యాచ్ తో కలిసి మెడికల్ క్యాంపు కోసమని అదే ఊరికి వస్తాడు.సుబ్రమణ్యస్వామికి గుడి గురించి తెలుసుకున్న కార్తిక్ గుడిని ఎందుకు మూసేశారు,గుడి గురించి మాట్లాడుకుంటే ఎందుకు చనిపోతారు,అసలు రహస్యం ఏంటి మొదలగు వాటిని ఎలా చేధించాడో అన్నది సినిమా కథ.
ప్లస్ పాయింట్స్
ఎక్కువగా అల్లరి చిల్లర పాత్రల్లో కనిపించే నిఖిల్ ‘స్వామి రారా’ చిత్రం ద్వారా తన పంథా మార్చుకున్నాడు.డీసెంట్ పెర్ఫార్మెన్స్ తో నిఖిల్ మరో సారి తన పాత్రకు న్యాయం చేశాడు.నటన పరంగా నిఖిల్ కు మంచి పేరు తెచ్చే చిత్రం ఇది.స్వాతి కూడా తన సహజ ధోరణికి భిన్నంగా ఈ సినిమాలో కనిపించింది.ముఖ్యంగా సినిమాకు దర్శకుడు రాసుకున్న కథ ప్లస్ అని చెప్పవచ్చు.సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంటుంది.సినిమా కథ ప్రేక్షకులకు ఈజీగా కనెక్ట్ అవుతుంది.ప్రవీణ్, సత్య వినోదంతో పాటు రావు రమేష్,తనికెళ్ళ భరణి లు పర్వాలేదనిపించారు.పాటల కంటే నేపథ్య సంగీతం బాగుంటుంది.కార్తీక్ సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంటుంది.లో బడ్జెట్ సినిమా అని ఎక్కడా అనిపించదు.కొత్త డైరెక్టరే అయినా కథను బాగానే హేండిల్ చేయగలిగాడు.
మైనస్ పాయింట్స్
స్వాతి-నిఖిల్ మధ్య లవ్ ట్రాక్
సినిమా క్లైమాక్స్
సినిమా సెకండ్ హాఫ్
అక్కడక్కడా బోర్ కొట్టించే సన్నివేశాలు
తీర్పు
కొంత వరకు భిన్నమైన కథే అని చెప్పవచ్చు.రొటీన్ కు భిన్నమైన కథ కోరుకునే వారికి ‘కార్తికేయ’ సరైన సినిమా.నిఖిల్ కు లభించిన మరో హిట్ సినిమా ఇది.కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నప్పటికీ సస్పెన్స్,థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను థియేటర్లకు నడిపిస్తుంది.

ఉపరితల ద్రోణి,వాయుగుండం – మరో మూడు రోజులు విస్తారంగా వర్షాలు
తూర్పు అరేబియా సముద్రంలో వాయుగుండం కొనసాగడంతోపాటు,శ్రీలంక నుండి తమిళనాడు
వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది.దీని ప్రభావంతో తెలంగాణా,ఆంధ్రప్రదేశ్ లలో
మరో మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయి.రానున్న 48 గంటల్లో
అరేబియా సముద్రంలో ఏర్పడ్డ వాయుగుండం తుఫాన్ గా మారి గుజరాత్ వైపు
వెళ్ళనుంది.
ఈ నెల 18న నైరుతి ఋతుపవనాలు దేశంనుండి వెనక్కి మళ్ళగా అదేరోజు తమిళనాడు,కేరళ,కర్ణాటకలో దక్షిణ ఆంధ్రప్రదేశ్ మీదుగా ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా సాగడం మొదలెట్టాయి.ఈ ఋతుపవనాల కారణంగా దక్షిణ భారతదేశంలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Andhra Pradesh News,
Telangana News
Friday, 24 October 2014
వరల్డ్ బిలియర్డ్స్ లో పంకజ్ అద్వానీ విజయం
భారత్ కు చెందిన పంకజ్ అద్వానీ వరల్డ్ బిలియర్డ్స్ చాంపియన్ ఫైనల్స్ లో విజయం సాధించి ట్రోఫి గెలుచుకున్నాడు.ఫైనల్స్ లో ఆయన సింగపూర్ కు చెందిన గిల్ క్రిస్ట్ పై విజయం సాధించారు. ఈ ట్రోఫిని గెలవడం పంకజ్ కు ఇది 11 వ సారి.వీరిద్దరి మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ లో మాత్రం గిల్ క్రిస్ట్ చేతిలో అద్వాని 3-2 తేడాతో ఓటమి చవిచూసి ఫైనల్ లో అందుకు ప్రతీకారం తీర్చుకున్నాడు.
ఫైనల్ లో కూడా మొదట 3-2 తో అద్వానీ వెనకబడ్డప్పటికీ బ్రేక్ తరువాత జరిగిన తదుపరి మూడు ఫ్రేమ్ లను గెలిచి చివరకు 6-2 తో విజయసాధించాడు.
ఫైనల్ లో కూడా మొదట 3-2 తో అద్వానీ వెనకబడ్డప్పటికీ బ్రేక్ తరువాత జరిగిన తదుపరి మూడు ఫ్రేమ్ లను గెలిచి చివరకు 6-2 తో విజయసాధించాడు.
Score (final): Pankaj Advani defeated Peter Gilchrist 6-2: 23-151 (145unf), 151 (127)-16, 116-150, 151(108unf)-104, 150(150unf)-0, 151(118)-58, 150-4, 150(77unf)-145(104)
Labels:
Sports News
కలల కొలువుకు ఇంటర్న్ షిప్
ఇంటర్న్ షిప్ కెరీర్ లో మొదట ఉద్యోగం సంపాదించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చాలామంది ఉద్యోగస్థులు, విద్యార్ధులు అభిప్రాయపడుతున్నారు.
ఈ విషయం ప్రముఖ ప్రొఫెషనల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ లింక్డ్ ఇన్ చేపట్టిన సర్వేలో వెల్లడైంది.మొదటి ఉద్యోగానికి ఆ అనుభవం ఎంతగానో ఉపయోగ పడుతుందని , ఇంటర్న్ షిప్ ద్వారా ఉద్యోగం సంపాదించడం కాస్త సులువు అవుతుందని 53% మంది లింక్డ్ ఇన్ సర్వేలో అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇంటర్న్ షిప్ కోరుకున్న జీతం, మంచి పని నేపధ్యం ఉన్న కలల కొలువును సొంతం చేసుకోడానికి ఉపయోగపడుతుందని ఈ సర్వే తెలిపింది.
సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అప్ డేట్ అవ్వడం కూడా ముఖ్యమని పలువురు ఉద్యోగులు, విద్యార్ధులు తెలిపారు. ఈ సర్వే ప్రకారం…
26% మంది ఐటీ రంగంలో
11% మంది ప్రొఫెషనల్ సర్వీస్ లో
10%మంది ఫైనాన్స్ రంగంలో ఉద్యోగం కోరుకుంటున్నారు.
అయితే ఈ సర్వే ప్రకారం.. 39% మంది ఉద్యోగంలో వృత్తిలో సంతోషానికి,
39% మంది డబ్బు
33% మంది కెరీర్ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నారు.

Education,
International News,
National News
మంగళయాన్ పై గూగుల్ ప్రత్యేక డూడుల్
మంగళయాన్ (మార్స్ ఆర్బిటాల్ మిషన్ )ను భారత దేశం అరుణ గ్రహకక్ష్యలోకి పంపించి నెల రోజులు పూర్తైన సందర్భంగా ప్రత్యేక డూడుల్ ని గూగుల్ రూపొందించింది.
ఇస్రో 2013 నవంబర్ 5 న శ్రీహరి కోటలోని షార్ నుంచి మామ్ ను PSLV- C25 వాహన నౌక ద్వారా నింగిలోకి పంపింది.
మామ్ 24 సెప్టెంబర్ 2014 వ తేదీన అరుణగ్రహ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది.
ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడంతో మొదటి ప్రయత్నంలోనే అతితక్కువ ఖర్చుతో అంగారకుడిపై ఉపగ్రహాన్ని పంపిన మొదటి దేశంగా భారత్ గుర్తింపు పొందింది.
ఇస్రో 2013 నవంబర్ 5 న శ్రీహరి కోటలోని షార్ నుంచి మామ్ ను PSLV- C25 వాహన నౌక ద్వారా నింగిలోకి పంపింది.
మామ్ 24 సెప్టెంబర్ 2014 వ తేదీన అరుణగ్రహ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది.
ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడంతో మొదటి ప్రయత్నంలోనే అతితక్కువ ఖర్చుతో అంగారకుడిపై ఉపగ్రహాన్ని పంపిన మొదటి దేశంగా భారత్ గుర్తింపు పొందింది.
Labels:
International News,
National News
సైరో మలబార్ మిషన్ కోసం కోయల్ రానా క్యాట్ వాక్
ప్రత్యేక అవసరాలున్న పిల్లలకోసం ఢిల్లీ లోని ‘సైరో మలబార్ మిషన్’ అనే స్వచ్ఛంద సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఆ సంస్థ తరపున పలువురు ప్రముఖులు వివిధ కార్యక్రమాలను చేపట్టారు.ఇటివల చిన్నారులతో కలిసి మిస్ ఇండియా వరల్డ్-2014 కోయల్ రానా ర్యాంపుపై నడిచారు. బాలివుడ్ సింగర్ అమన్ తిఖ్రా పాటలతో అలరించారు.పలువురు సినీ ప్రముఖులు వివిధ ప్రదర్శనలను నిర్వహించగా ప్రముఖులతో పాటు సంస్థ అధికారులు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Labels:
National News
వేలానికి జేమ్స్ బాండ్ సబ్ మెరైన్ కారు
జేమ్స్ బాండ్ సినిమా ‘ ద స్పై హు లవ్ డ్ మి ‘లో ఉపయోగించిన 1977 మోడల్ లోటస్ ఎస్పిరిటి సబ్ మెరైన్ కారును యజమాని ప్రముఖ ఈకామర్స్ వెబ్ సైట్ అయిన ఈబే లో వేలానికి పెట్టాడు.ఈ వేలం ప్రారంభ ధర 10 వేల అమెరికన్ డాలర్లు యజమాని లాస్ వేగాస్ చెందిన రిక్ డెల్ సమాచారం ప్రకారం లోటస్ ఎస్పిరిటి సబ్ మెరైన్ కార్లు తన వద్ద మూడు ఉన్నాయని తెలిపారు.ఈ మోడల్ కార్లు ఆరు తయారు చేయగా ప్రస్తుతం మూడు కార్లు ఉన్నాయని పేర్కొన్నారు.
Labels:
International News
పాస్ వర్డ్ దొంగలిస్తే ఫేస్ బుక్ కనిపెట్టేస్తుంది !
ఫేస్ బుక్ వినియోగ దారుల ఖాతాల రక్షణ కోసం మరో అడుగు ముందుకేసింది.
దొంగిలించిన పాస్ వర్డ్,ఈ మెయిల్ ఐడీలను పర్యవేక్షించడానికి కొత్తగా
ఆటోమేటిక్ సర్వీస్ ను ప్రారంభించింది. తప్పుగా ఎంటర్ చేసే పాస్ వర్డ్,
ఈమెయిల్ ఐడీలను ఫేస్ బుక్ డేటాబేస్ లో ఉన్న సమాచారం ద్వారా కంప్యూటర్
ప్రోగ్రాం చే విశ్లేషించే విధానాన్ని రూపొందించారు.దీని ద్వారా పాస్ వర్డ్,
ఈమెయిల్ ఐడీలు కానీ తప్పుగా ఎంటర్ చేసినా , మరెక్కడైనా అనధికారికంగా
వాడుతున్నట్లు తేలినా ఫలానా వినియోగదారుడికి నోటిఫికేషన్ అందుతుందని ఫేస్
బుక్ పేర్కొంది.సమస్య తలెత్తిన ఫేస్ బుక్ ఖాతా వినియోగ దారుడికి పాస్ వర్డ్
మార్చుకోమని నోటిఫికేషన్ పంపుతామని సంస్థ తెలిపింది.
Labels:
International News
సమన్వయంతో పనిచేసే రోబోలు
అమెరికా, చైనా రెండు దేశాల పరిశోధకులు సంయుక్తంగా క్లౌడ్ కంప్యూటింగ్ ను
ఉపయోగించుకొని రెండు రోబోలు సమన్వయం చేసుకొని పనిచేసే విధానాన్ని
రూపొందించారు. అమెరికాలోని పిట్స్ బర్గ్ కు చెందిన ఓ యునివర్సిటీ
పరిశోధకులు, చైనాలోని ఓ యూనివర్సిటీ పరిశోధకులు ఇంటర్నెట్ బేస్డ్
కంప్యూటింగ్ ఉపయోగించుకొని వేర్వేరు తరహాలకు చెందిన రోబోలు సమన్వయంతో పని
చేసుకునే విధానాన్ని విజయవంతం చేశారు. ‘కేజా’ అనే చైనాకు చెందిన రోబో మానవ
భాషనూ అర్ధం చేసుకొని స్పందించగలదు.’కొబోట్ ‘ అనే పిట్స్ బర్గ్ కు చెందిన
రోబో అత్యంత క్లిష్టమైన సమాచారాన్ని విశ్లేషించగలదు.కేజా ఇంటిపనులు చేసే
రోబోగా,టూరిస్ట్ గైడ్ గా పని చేయగలదు.రెండు విభిన్న రోబోలను కలిపి క్లోడ్
కంప్యూటింగ్ ద్వారా పని చేయడం వల్ల తక్కువ ఖర్చుతో రోబోల అభివృద్ధి
విషయంలో మరింత పురోగతి సాధించవచ్చునని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.
Labels:
International News
Thursday, 23 October 2014
2015 లో చూడదగ్గ నగరాల్లో టాప్ టెన్ లో చెన్నైకి చోటు-10 అందమైన నగరాలు వీక్షించండి
అంతర్జాతీయ ట్రావెల్ గైడ్ ‘లోన్లీ ప్లానెట్’ ప్రతీ సంవత్సరం విడుదల
చేసే చూడదగ్గ నగరాల్లో 2015 సంవత్సరానికి గాను చెన్నై నగరం మొదటి పది
స్థానాల్లో ఒకటిగా నిలిచింది.’లోన్లీ ప్లానెట్’ విడుదల చేసిన ఈ జాబితాలో
చెన్నైకి తొమ్మిదో స్థానం దక్కింది.ఈ జాబితాలో కెనడాకు చెందిన టొరంటో నగరం
10వ స్థానంలో నిలవగా యూఎస్ఏ రాజధాని వాషింగ్టన్ డీ సీ మొదటి స్థానం
దక్కించుకుంది.
చెన్నై మెట్రో రైల్ ఓపెనింగ్,ద్రావిడ దేవాలయాలు,మనోహరమైన సంగ్రహాలయాలు(museums),బ్రిటిష్ కాలం నాటి కోటలు మరియు చర్చిలు,మూడు కిలోమీటర్ల పొడవైన బీచ్,ఇండియాలో రెండో అతిపెద్ద సినీ పరిశ్రమ ‘కోలీవుడ్’ మొదలగునవి చెన్నై ని తొమ్మిదో స్థానంలో నిలబెట్టాయి.

Subscribe to:
Posts (Atom)