ఐపీఎల్-8 లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్,ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్ల వైజాగ్ లో మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది.
మొదట ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ఒక్క పరుగుకే వెనుదిరిగినా ఆ తరువాత కెప్టెన్ డుమినీ తో జత కలిసిన మరో ఓపెనర్ శ్రేయాస్ అయ్యర్ స్కోరు బోర్డును ఉరకలెత్తించాడు.5 సిక్సుల సహాయంతో 40 బంతుల్లోనే 60 పరుగులు చేశాడు.డుమినీ 41 బంతుల్లో 54 పరుగులతో రాణించాడు.వీరిద్దరూ రెండో వికెట్ కు 78 పరుగులు జోడించారు.
ఆ తరువాత వచ్చిన యువరాజ్ 9 పరుగులకే బౌండరీ దగ్గర వార్నర్ అద్భుత క్యాచ్ కి వెనుదిరిగాడు.చివర్లో జాదవ్ 19,మాథ్యుస్ 15 పరుగులతో రాణించారు.
హైదరాబాద్ టీమ్ లో ప్రవీణ్ కుమార్,స్టెయిన్,భువనేశ్వర్ కుమార్,ఆశిష్ రెడ్డి తలా ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
No comments:
Post a Comment