U-19 బెంగాల్ క్రికెటర్ అంకిత్ కేశ్రి కోల్ కతా లో జరిగిన ఒక క్రికెట్ మ్యాచ్ శుక్రవారం గాయపడి సోమవారం ఉదయం మరణించాడు.నాలుగు నెలల క్రితం క్రికెట్ ఆడుతూ గ్రౌండ్ లోనే కుప్పకూలి మరణించిన ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ ఉదంతం మరవకముందే ఈ ఘటన మనదగ్గర జరగడం విచారించదగ్గ విషయం.
మైదానంలో ఒక క్యాచ్ కోసం ప్రయత్నించి ఇద్దరు ఆటగాళ్ళు ఒకరినొకరు బలంగా తాకడంతో అంకిత్ కేశ్రి మరణించాడు.
శుక్రవారం కోల్ కతా లోని జాదవ్ పూర్ యూనివర్సిటీ క్యాంపస్ గ్రౌండ్ లో ఈస్ట్ బెంగాల్,భవాని పూర్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది.44వ ఓవర్లో స్వీపర్ కవర్లో సబ్సిటిట్యూట్ ఫీల్డర్ గా ఫీల్డింగ్ చేస్తున్నాడు అంకిత్.సౌరవ్ మొండల్ బౌలింగ్ లో క్యాచ్ కోసం అంకిత్ పరుగెత్తాడు,అదే సమయంలో బౌలర్ కూడా క్యాచ్ కోసం పరిగెత్తి అంకిత్ ను బలంగా తాకాడు,సౌరవ్ మోకాలు అంకిత్ తల,మెడ భాగంలో గట్టిగా తగలడంతో మైదానంలో ఇద్దరూ కుప్పకూలారు.
గ్రౌండ్ లో కదలలేని స్థితిలో స్పృహ తప్పి పడి ఉన్న అంకిత్ ను సహచర ఆటగాళ్ళు సమీపంలోని AMRI కి తరలించారు.అక్కడినుండి నైటింగేల్ ఆసుపత్రికి తరలించారు.ఆదివారం వరకు అంకిత్ ఆరోగ్యం నిలకడగానే ఉందని ప్రకటించినా సోమవారం గుండె పోటు రావడంతో తుదిశ్వాస విడిచాడు అంకిత్ కేశ్రి.
అంకిత్ కేశ్రి మృతి పట్ల సచిన్,మమతా బెనర్జీ,గంగూలీ,కుంబ్లే లు సంతాపం తెలిపారు.
No comments:
Post a Comment