భూకంపం సృష్టించిన భూప్రళయానికి నేపాల్ అతలాకుతలమైంది.మృతుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. మంగళవారం సాయంత్రానికి నాటికి నేపాల్ లో మృతుల సంఖ్య 5,057 కి చేరింది. అయితే ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది. మంగళవారం ఉదయమే నేపాల్ ప్రధాని సుశీల్ కొయిరాల మృతుల సంఖ్య 10,000 కు చేరవచ్చునని వెల్లడించారు.
భూ కేంద్రానికి సమీపంలోనే ఉన్న ఒక గ్రామంలో కొండచరియలు విరిగిపడ్డాయి. అధికారులు ఈ ఘటనలో 250 మంది గల్లంతైనట్లు తెలిపారు. అయితే సహాయక చర్యలు ఆశించిన మేరకు సాగడం లేదని నేపాల్ ప్రధాని అంగీకరించారు.
సహాయక సిబ్బంది ఇంకా మారుమూల ప్రాంతాలకు చేరలేకపోతున్న నేపధ్యంలో బాధితులే పలు చోట్ల తమ ఆత్మీయుల కోసం శిధిలాలలో అన్వేషిస్తున్నారు.
15 దేశాలకు చెందిన 170 మంది విదేశియూల్ని భారత్ మంగళవారం సురక్షితంగా తరలించింది. నేపాల్ భూకంపం భాధితుల కోసం భారత్ తన సహాయక చర్యలను కొనసాగిస్తూనే ఉంది.
No comments:
Post a Comment