తెలంగాణా రాష్ట్ర ఇంటర్ ద్వితీయ సంవత్సర జనరల్,వృత్తి విద్యా కోర్సుల ఫలితాలను ఉప ముఖ్యమంత్రి,విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి విడుదల చేశారు.61.41 శాతంతో 2,32,742 మంది ఉత్తీర్ణులయ్యారు.
సెకండ్ ఇయర్ ఫలితాల్లోనూ అమ్మాయిలే పైచేయి సాధించారు. 66.86 శాతం అమ్మాయిలు ఉత్తీర్ణత సాధించగా,అబ్బాయిలు 55.91 శాతం ఉత్తీర్ణత సాధించారు.ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా 75% తో మొదటి స్థానంలో నిలవగా,నల్గొండ 58% తో చివరి స్థానంలో నిలిచింది.
మే 25నుండి సప్లమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని,దరఖాస్తు చేసుకోవడానికి మే 6 చివరి తేదీ అని మంత్రి కడియం శ్రీహరి తెలిపారు.
No comments:
Post a Comment