ఆ ఇద్దరు భారతీయ యువకులు సమయస్ఫూర్తితో మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కాపాడి సింగపూర్ పౌర రక్షణశాఖ ప్రశంసలను అందుకున్నారు.
సింగపూర్ లోని జురోంగ్ ఈస్ట్ ఎస్టేట్ లో కన్ స్ట్రక్షన్ సెక్టార్ లో షణ్ముగన్ నతన్, ముత్తుకుమార్ గత నాలుగేళ్లుగా పని చేస్తున్నారు.
వారు నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ లో ఓ చిన్నారి ఆడుకుంటూ వెళ్లి రెండో అంతస్తులోకి బాల్కనీ నుంచి జారిపడింది.
బాల్కనీ రాడ్ కు ఆ చిన్నారి దుస్తులు చిక్కుకోవడంతో చిన్నారి రెండో అంతస్థులో వేలాడుతూ కనిపించింది.ఇది గమనించిన స్థానికులు రేస్కూ సిబ్బందికి సమాచారం అందించారు.
షణ్ముగన్ నతన్(35), ముత్తుకుమార్ (24) లు వెంటనే స్పందించి ఆ చిన్నారిని క్షేమంగా కిందకు దించారు.
భారతీయ యువకుల సాహసాన్ని గుర్తించిన సింగపూర్ ప్రభుత్వం వారికి వారి సాహసానికి గుర్తింపుగా ప్రజా ప్రవృత్తి అవార్డు (Public Spiritedness Award) తో సత్కరించింది.
No comments:
Post a Comment