ఝార్ఖండ్ కు చెందిన యాసిడ్ దాడి బాధితురాలు సోనాలి ముఖార్జీకి తన ఫేస్ బుక్ స్నేహితుడితో వివాహం జరిగింది. ఒడిశా లోని ఓ ప్లాంట్ లో ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా పని చేస్తున్న చిత్తరంజన్ తివారి అనే వ్యక్తితో సోనాలికి ఝార్ఖండ్ లోని బొకారో లో వివాహం జరిగింది.
గతంలో కౌన్ బనేగా కరోడ్ పతి షోలో ఈ యాసిడ్ బాదితురాలు ఎంతో స్పూర్తిమంతంగా మాట్లాడి అమితాబ్ బచ్చన్ ప్రశంశలను అందుకుంది.అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగం కోసం డిమాండ్ చేసి మీడియా ద్వారా పలువురు అభిమానుల్ని కూడా సంపాదించుకున్నారు.
సోనాలి ధైర్యాన్ని గమనించిన చిత్తరంజన్ తివారి ఫేస్ బుక్ లో ఆమెకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించారు.
వీరిమధ్య స్నేహంపెరిగి ప్రేమగా మారింది.
ఫేస్ బుక్ ఖాతాలో వీరి వివాహ చిత్రాల్ని సోనాలి పొందుపరిచింది. 2003 లో 18 ఏళ్ల వయసుల్లో సోనాలి యాసిడ్ దాడికి గురైంది.
No comments:
Post a Comment