లోక్ సభ రెండో దశ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి.మొదటి రోజు నుండే లోక్ సభ సమావేశాలు వేడి వేడిగా జరగనున్నాయి.ఈ లోక్ సభ బడ్జెట్ సమావేశాలు మే 8వరకు కొనసాగనున్నాయి.ఏప్రిల్ 23 నుండి రాజ్యసభ సమావేశాలు జరగనున్నాయి,ఏప్రిల్13 న రాజ్యసభ సమావేశాలు ముగుస్తాయి.
నూతన అత్యవసర భూసేకరణ ఆర్డినెన్సు ను మొదటి రోజే లోక్ సభ లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.నష్ట పరిహార హక్కు,భూసేకరణలో పారదర్శకత,పునరావాసం,పునరాశ్రయం(సవరణ) ఆర్డినెన్సు కాపీ ని పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి ప్రతాప్ రూడీ సభలో ప్రవేశపెట్టనున్నారు,రాజ్యాంగంలోని ఆర్టికల్ 123 (2)(a) కింద ఏప్రిల్ 3న రాష్ట్రపతి ప్రకటిస్తాడు.
యెమెన్ దేశంలో నెలకొన్న సంక్షోభం నుండి భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలింపు మొదలగు అంశాల మీద విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటన చేయనున్నారు.
భూసేకరణ ఆర్డినెన్సు బిల్లును సభలో ప్రవేశపెట్టనుండడంతో బీజేపీ ఎమ్మెల్యేలు తప్పక పార్లమెంట్ కు హాజరు కావాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు కోరారు.
No comments:
Post a Comment