ఇబ్రహీంపట్నం టీడీపీ ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి బుధవారంనాడు ఉదయం తెరాస అధినేత,ముఖ్యమంత్రి కెసిఆర్ ను ఆయన అధికార నివాసంలో కలుసుకున్నారు.
ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి గత కొంతకాలంగా తెరాస లో చేరుతారు అని ఊహాగానాలు వస్తున్నాయి.ఇన్ని రోజులు ఆలాంటిది ఏమీ లేదని కొట్టిపారేసిన టీ-టీడీపీ కిషన్ రెడ్డి సీఎం ను కలవడంతో ఊహాగానాలకు దాదాపు తెరపడినట్టే.
24వ తారీఖున జరిగే టీఆర్ఎస్ ప్లీనరీలోనే కిషన్ రెడ్డి తెరాస లో చేరే అవకాశం ఉంది.
తరువాత మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి,ఈ నెల 24న తెరాస పార్టీలో చేరతున్నట్టు తెలిపారు.నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు,టీడీపీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నాని,నియోజకవర్గ కార్యకర్తలు,నేతలతో చర్చించాకే పార్టీ మారే విషయంపై నిర్ణయం తీసుకున్నాని కిషన్ రెడ్డి తెలిపారు.
No comments:
Post a Comment