తెలంగాణా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాలను బుధవారం విడుదల చేశారు డిప్యూటీ సీఎం,విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి.ప్రతీ సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఫలితాల్లో అమ్మాయిలే పై చేయిగా నిలిచారు.
మొత్తం 4,31, 363 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 2,39,954 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షల ఉత్తీర్ణత శాతం 55.62 శాతంగా ఉంది. ఇందులో బాలికలు 61.68 శాతం. బాలురు 49.60 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురతో పోల్చుకుంటే 12.08% మంది అధికంగా బాలికలు ఉత్తీర్ణులయ్యారు.వృత్తి విద్యలో 43.43% ఉత్తీర్ణత సాధించారు.గతేడాది తో పోల్చితే ఈసారి 2.97% ఉత్తీర్ణత పెరిగింది.
ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా 71% తో మొదటి స్థానంలో ఉండగా నల్గొండ(43%) చివరి స్థానంలో నిలిచింది.
పరీక్షలు విజయవంతంగా నిర్వహించిన అధికారులకు కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి కడియం.
మొదటి సంవత్సరం సప్లమెంటరీ పరీక్షలు మే 25 నుండి జూన్ 1 వరకు నిర్వహిస్తాము,పరీక్ష ఫీజు చెల్లింపునకు తుది గడువు మే 1 అని కడియం శ్రీహరి తెలిపారు.
No comments:
Post a Comment