తెలంగాణ రాష్ట్రానికి సాంకేతిక విద్య, శిక్షణా మండలి ఏర్పాటైంది.
ఈ మేరకు గురువారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చట్టాన్ని అన్వయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఈ మండలికి ఛైర్మెన్ గా సాంకేతిక విద్యాశాఖ సంచాలకులు, వైస్ ఛైర్మెన్ గా ఉపాధి శిక్షణా సంచాలకులు వ్యవహరించనున్నారు.
ఈ మండలిలో సభ్యులుగా పరిశ్రమల శాఖ అదనపు సంచాలకులతో పాటు 14 మంది నామినేటెడ్ సభ్యులు కొనసాగనున్నారు.
No comments:
Post a Comment