Radio LIVE


Breaking News

Sunday, 19 April 2015

మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ రాహుల్

రెండు నెలలు సెలవుల మీద వెళ్లి వచ్చిన కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ వెంటనే ప్రభుత్వ వ్యతిరేక ప్రజా పోరాటానికి దిగారు.ఆదివారం రాంలీలా మైదానంలో జరిగిన భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా కిసాన్ ర్యాలీలో ప్రసంగించారు రాహుల్.
సోనియాగాంధీ,మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ర్యాలీని ఉద్దేశించి మాట్లాడారు.
రాహుల్ ఏమన్నారో చూద్దాం..
  • ప్రభుత్వం తమను మరిచిందని ఈ దేశంలోని రైతులు,కార్మికులు చాలా కలత చెందుతున్నారు.
  • మా ప్రభుత్వం 2013 లో తీసుకొచ్చిన భూసేకరణ బిల్లులో మార్పులు చేస్తున్నందుకు రైతులు భయాందోళనలకు గురౌతున్నారు.
  • ప్రతిరోజు రైతు భయంతోనే జీవిస్తున్నాడు,తెల్లవారితే తన భూమి ఏమౌతుందో అని.
  • పారిశ్రామికవేత్తలతో పోల్చుకుంటే రైతులు జాతి బలోపేతానికి దోహదపడుతున్నాడు.దేశానికే తిండి పెడుతుంది రైతన్న.
  • 70,000 కోట్ల రుణమాఫీ చేసింది మా ప్రభుత్వం.
  • శ్రామికుల కోసం మేము MNREGA తీసుకొచ్చాం.
  • మేము ఏమి చేసిన అది పేద వాళ్ళ లబ్ది కోసమే చేశాము,చేస్తూనే ఉంటాము.
  • మీ కోసం నేను పోరాటం చేస్తాను.
  • ప్రధానమంత్రికి రైతుల యొక్క శక్తి ఏంటో అర్ధం కావడం లేదు.
  • ఎన్నికల సమయంలో పారిశ్రామికవేత్తల దగ్గర డబ్బులు లోన్ తీసుకున్న మోడీ,తరువాత వాటిని తిరిగి ఇచ్చి మీ భూములను వారికి ఇస్తున్నారు.
  • గుజరాత్ లో చేసినట్టు రైతుల దగ్గరినుండి భాములను లాక్కొంటున్నాడు.
  • ఇది వరకు అలానే మీ దగ్గర భూములను తీసుకొని అందుకు డబ్బులు ఇవ్వలేదు.మేము వచ్చాక మార్కెట్ ధరకు 4 రెట్లు డబ్బులు చెల్లించాము.
  • రైతుల నుండి భూమి తీసుకోవడానికి ముందు బీజేపీ ప్రభుత్వం వారిని కనీసం అడగడంలేదు.
  • 'మేక్ ఇన్ ఇండియా' అనేది మోడీ కల అంట,అది కలగానే మిగిలిపోతుంది.మీ భూములను లాక్కొన్నాక మీకు మీకు ఉపాధి ఎక్కడినుండి వస్తుంది.
  • నిజంగానే వారు 'మేక్ ఇన్ ఇండియా' కావాలని కోరుకుంటే,ఎందుకు వారి ఐదు సంవత్సరాల క్లాజ్ ను మార్చుకున్నారు.ఎవరి భూములు వారికి ఇవ్వాల్సిందే.
  • కాంగ్రేస్ మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది.ఎక్కడ భూమి లాక్కోవాలని చూస్తారో మీము అక్కడే ఉంటాము,కాంగ్రేస్ కార్యకర్తలు ఉంటారు,నేను ఉంటాను అక్కడ.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates