టెక్ మహేంద్రా ఫౌండేషన్ సహకారంతో యుగాంతర్ సంస్థ నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇచ్చి అనంతరం ఉద్యోగ అవకాశాలు కల్పిసున్నట్లు యుగాంతర్ సంస్థ మొబిలైజేషన్ కో ఆర్డినేటర్ కే.నిరంజన్ యాదవ్ తెలిపారు.
10 వ తరగతి పాస్ ఆపై విద్యార్హతలు కలిగిన 18 నుంచి 27 సంవత్సరాలలోపు యువతీ యువకులు ఈ శిక్షణకు అర్హులని ఆయన అన్నారు.
కంప్యూటర్ బేసిక్స్, ఎంఎస్-ఆఫీస్ 2010,స్పోకెన్ ఇంగ్లీష్, ఇంటర్నెట్ కాన్సెప్ట్స్, ఇంగ్లీష్ టైపింగ్, కమ్యునికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యు స్కిల్స్, టాలీ ఈఆర్పీ9,బేసిక్ అకౌంట్స్, అడ్వాన్స్ డ్ ఎంఎస్ ఎక్సెల్ తదితర కోర్సులలో మూడు నెలలపాటు ఉచిత శిక్షణ ఇచ్చి అనంతరం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు.
ఈ నెల 25వ తేదీలోగా కొఠీ శిక్షణ కేంద్రంలో అర్హులైన యువతీయువకులు తమ పేర్లను నమోదు చేస్తుకోవల్సిందిగా ఆయన అన్నారు.
ఇతర వివరాలకు 9030055998, 9959627037 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.
No comments:
Post a Comment