యెమెన్ రక్షణ మంత్రి జనరల్ మహ్మద్ అల్ సుబాహీ ని నాలుగు వారాల తర్వాత తిరుగుబాటు దారులు వదిలి వేశారు.
గత నెల మార్చి నుంచి బందీగా ఉన్న రక్షణ మంత్రి అల్ సుబాహీ తో పాటు అధ్యక్షుని సోదరుడు జనరల్ నాసర్ మన్సూర్ హాడీ, జనరల్ ఫైసల్ రాజాబ్ లను హౌతీ తీవ్రవాదులు తమ చెరనుంచి విడుదల చేశారు.
అయితే నాలుగు వారాలుగా చేపట్టిన వైమానిక దాడులను నిలిపివేస్తున్నట్లు సౌదీ సంకీర్ణ సైనిక కూటమిప్రకటించిన తర్వాతే ఈ సంఘటన జరగడం గమనార్హం.
హౌతీ తీవ్రవాదుల చెర నుంచి రక్షణ మంత్రి విడుదల
No comments:
Post a Comment