ఇప్పటివరకు భూకంప విలయంలో 2000 మంది మృతి చెందినట్లు నేపాల్ ఆర్ధిక మంత్రి అధికారికంగా వెల్లడించారు.ప్రమాద వివరాలపై ఆయన ప్రకటన చేస్తూ.. దాదాపు 5 వేల మందికి పైగా గాయపడ్డారు అని తెలిపారు .
ఒక్క ఖాట్మండ్ లోనే 1000 మంది చనిపోయారు.వేలాది మంది గల్లంతై ఉండవచ్చని అయన అన్నారు.5 వేల మందికి పైగా మృతి చెంది ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు
నేపాల్ భూకంపంలో చిక్కుకున్న ప్రజలు రాత్రంతా ఆరుబయటే గడిపారు.శిధిలాల క్రింద మృతులు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నట్లు సమాచారం.ఈ తెల్లవారుజామున భూమి మూడు సార్లు కంపించింది.
ఇదిలా ఉండగా.. గత 24 గంటల నుండి నేపాల్ భూకంపంలో చిక్కుకున్న ప్రజలు వారికి తినడానికి ఏమి దొరకడం లేదని,తాగడానికి మంచి నీరు కూడా లభించడం లేదని, గాయపడిన వారికి సరైన మందులు కూడా అందుబాటులో లేవని వారు వాపోయారు.
భారత్ తన ఆర్మీ బృందాన్ని నేపాల్ కు సహాయక చర్యల్లో పాల్గొనడానికి పంపించాలని నిర్ణయించింది.ఇప్పటికే ఓ బృందం అక్కడికి చేరింది. కాగా 500 మంది భారతీయులను 3 ప్రతేక విమానాల్లో స్వదేశానికి తరలించారు.
నేపాల్ కు భారతదేశం మరో 10 విమానాలను పంపనుంది. వీటిలో సహాయక సిబ్బందితో పాటు, ఆహార పదార్ధాలను మరియు వస్తు సామాగ్రిని తరలిస్తున్నట్లు సమాచారం. నేపాల్ లో భారత ఆర్మీ చేపడ్తున్న సహాయ కార్యక్రమాలకు “ ఆపరేషన్ మైత్రీ “ అనే పేరు ను పెట్టారు.మరో 10 NDRF బృందాలను సహాయక చర్యల్లో పాల్గొనడానికి భారత్ నేపాల్ కు పంపించనుంది.

No comments:
Post a Comment