ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ 28 మంది ఇథియోపియన్ క్రైస్తవులను లిబియాలో చంపుతున్న దృశ్యాలను విడుదల చేసింది.బందీలుగా పట్టుకున్న రెండు బృందాల్లోని వారి ప్రాణాలు తీస్తుండగా తీసిన వీడియోను ఇంటర్ నెట్ లో పెట్టారు.
క్రైస్తవులు ముస్లింలుగా మతమార్పిడి చేసుకోవాలని ముసుగు ధరించిన సాయుధ ఉగ్రవాది హెచ్చరిస్తున్న దృశ్యాలు ఆ విడియోలో ఉన్నాయి.
29 నిముషాల నిడివిగల ఈ విడియోలో ఉగ్రవాదులు ముసుగు ధరించి సముద్ర తీర ప్రాంతంలో 12 మంది క్రైస్తవ బందీల తలలను నరికేస్తున్న వీడియోను, మరో 16 మందిని ఎడారి ప్రాంతంలో తుపాకులతో కాల్చివేసిన దృశ్యాలను ఈ విడియోలో పొందుపర్చి అంతర్జాలంలో పెట్టారు. ఎంతమందిని చంపారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
No comments:
Post a Comment