Radio LIVE


Breaking News

Saturday, 25 April 2015

నేపాల్ లో అత్యవసర పరిస్థితి..ఇదే పెద్ద భూకంపమని వెల్లడించిన IMD

శనివారం ఖాట్మండ్ కి 77 కిలోమీటర్ల దూరంలో ఉదయం 11.41 గంటలకు రిక్టర్ స్కేల్ పై 7.9 గా సంభవించిన భూకంపం కారణంగా భారీగా ఆస్తి నష్టం , ప్రాణ నష్టం సంభవించిన విషయం తెలిసిందే.

దేశ రాజధానిలో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5 పాయింట్లుగా నమోదైందని ఇండియా మేటియోరాలజికల్ డిపార్ట్ మెంట్ (IMD) అధికారులు తెలిపారు.మరోసారి నేపాల్ లోని కొడారి ప్రాంతంలో 5.1 గా భూప్రకంపనలు ఏర్పడినట్లు అధికారులు తెలిపారు.నేపాల్ లోని కీర్తిపూర్ కు 69 కిలోమీటర్ల దూరంలో 6.6 గా మరో ప్రకంపన నమోదైందని వారు వెల్లడించారు.

నేపాల్ ను వణికించిన భూకంపం…చిత్రాలు

భూకంపం అనంతరం ప్రకంపనలు ఏర్పడుతున్నాయని, వరుసగా భూకంప ప్రాంతంలోనే ప్రకంపనలు నమోదవుతున్నాయని, నేపాల్ లో ఇంకా భూకంప ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయని వారు తెలిపారు.

భూకంపం పెరిగే కొద్ది భూకంప తీవ్రత తగ్గుతుందని, ఉత్తరప్రదేశ్, కోల్ కతా, పశ్చిమబెంగాల్,బీహార్, ఛత్తీస్ గడ్, రాజస్థాన్ ,లఖ్ నపూర్, ఒడిశా, కేరళ, హర్యనాలోనూ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి అని వారు వివరించారు.
నేపాల్ రాజధానితో పాటు ఉత్తర భారత్, ఈశాన్య రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాల్లో శనివారం సంభవించిన భూకంపం పెద్ద భూకంపమని ఇండియా మేటియోరాలజికల్ డిపార్ట్ మెంట్ (IMD) వెల్లడించింది.కాగా మృతుల సంఖ్య 900 మందికి చేరింది.
 నేపాల్ ప్రధాని సుశీల్ కోయిరాలా

 నేపాల్ ప్రధాని సుశీల్ కోయిరాలా
భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగడంతో నేపాల్ ప్రభుత్వం అప్రమత్తమైంది.దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో నేపాల్ కు రావాల్సిన విమానాలను భారత్ కు మళ్లిస్తున్నారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates