సుధీర్ వర్మ అని పేరు వినగానే గుర్తుకొచ్చేది ‘స్వామి రా రా’.నాగ చైతన్య హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన తన తదుపరి చిత్రం ‘దోచేయ్’.’దోచేయ్’ చిత్రం ఏప్రిల్ 24 శుక్రవారం రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది.’దోచేయ్’ సినిమా ప్రేక్షకుల మదిని దోచిందో లేదో చూద్దాం.
చిత్రం : దోచేయ్
నటీనటులు : నాగ చైతన్య,కృతి సనన్,రావు రమేష్,పోసాని,బ్రహ్మానందం,రవి బాబు
దర్శకుడు : సుధీర్ వర్మ
సంగీతం : సన్నీ ఎం ఆర్
నిర్మాత : బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్
విడుదల : ఏప్రిల్ 24,2015
రేడియో జల్సా రేటింగ్ : 3/5
కథ :
సీతారాం(రావు రమేష్)కుటుంబాన్ని పోషించడానికి డ్రైవర్ గా జీవనం సాగిస్తుంటాడు.అనుకోకుండా ఒక దొంగతనం కేసులో సీతారాం ను అరెస్ట్ చేస్తారు పోలీసులు.తండ్రి జైలుకు వెళ్ళడంతో సీతారాం కొడుకు చందూ(నాగ చైతన్య) మోసం చేస్తూ డబ్బులు సంపాదిస్తూ చెల్లి లలితను మెడిసిన్ చదివిస్తుంటాడు.ఏరియా ఇన్స్పెక్టర్ రిచర్డ్ (రవిబాబు)కు కమిషన్ ఇస్తూ మోసాలకు పాల్పడుతూ ఉంటాడు చందు.
చిన్న చిన్న దొంగతనాలు చేసే పోసాని తరువాత బ్యాంక్ దొంగతనాలు చేసే స్థాయికి ఎదుగుతాడు.చందు కు ఒకసారి రెండు కోట్లు అవసరమైతాయి.అదే సమయంలో పోసాని బ్యాంక్ దోచుకొని వస్తు డబ్బులు ఓకే ఘటనలో పోగొట్టుకుంటాడు.ఆ డబ్బు చందుకు దొరుకుతాయి.చందు కు డబ్బు దొరికిన విషయం పోసాని కి తెలుస్తుంది.ఆ డబ్బు చందు దగ్గరి నుండి రాబట్టడానికి సీతారాం ను,లలిత ను కిడ్నాప్ చేస్తాడు పోసాని.బుల్లెట్ బాబు(బ్రహ్మానందం)సహాయంతో తన చెల్లిని,నాన్నను ఎలా కాపాడుకుంటాడు.చందు ప్రేమించిన అమ్మాయి కృతిని పెళ్లి చేసుకుంటాడా లాంటివి తెలుసుకోవాలంటే వెండితెర మీద చూడాల్సిందే.
ప్లస్ పాయింట్లు :
చివరి 30 నిమిషాలు
బ్రహ్మానందం వచ్చాక సినిమా వేగం పెరిగింది,చివర్లో సప్తగిరి,తాగుబోతు రమేష్ ల కామెడీ
నాగ చైతన్య మిగతా సినిమాల్లో కంటే ఇందులో వైవిధ్యంగా కనిపిస్తారు
నాగ చైతన్య-కృతి సనన్ ల రొమాన్స్
క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ లు
హీరో మీద కంపోస్ చేసిన చేజింగ్ సీన్
మధురిమ ఐటెం సాంగ్
మైనస్ పాయింట్లు :
హీరో పాత్ర ఎలివేట్ చేసే అంతగా విలన్ పాత్రలు లేకపోవడం
పాటలు వచ్చే సందర్భం
సంగీతం అంత ప్రభావంగా లేదు
కథ అంత బలంగా లేదు
కొన్ని పాత్రల ముగింపు
సాంకేతిక విభాగం :
దర్శకుడు సుధీర్ వర్మ మొదటి సినిమా స్వామి రారా మీద తీసుకున్న శ్రద్ద ఈ సినిమా మీద తీసుకున్నట్టు కనిపించలేదు.కథను అంత సమర్దవంతంగా నడిపించలేదు.స్క్రీన్ ప్లే క్లైమాక్స్ లో తప్పిస్తే మిగతా సందర్భాలలో అంతే ఎఫెక్టివ్ గా లేదు.సినిమా కు అతిపెద్ద ప్లస్ ఏదైనా ఉంది అంటే రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ.సినిమాలో విజువల్స్ బాగున్నాయి.సన్నీ ఎం.ఆర్ అందించిన సంగీతం ఆకట్టుకోలేదు.బీ వి ఎస్ ప్రసాద్ నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరిగా :
నిజానికి ఈ సినిమాలో నాగ చైతన్య క్యారెక్టర్ మాస్ అయినప్పటికీ క్లాస్ గా కనిపించిండు.’ఎ’ సెంటర్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకోవచ్చు సినిమా,బాక్సాఫీసు దగ్గర డబ్బులు రాబడుతుందో లేదో చూడాలంటే కొన్ని రోజులు ఆగాలి.
No comments:
Post a Comment