మహారాష్ట్రలోని భూసే గ్రామంలో ఓ మూడున్నరేళ్ళ బాలుడిపై చిరుతపులి చేసిన దాడిలో బాలుడు మృతిచెందాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం సుమారు 7:30 నిముషాలకు గణేష్ అనే బాలుడు ఆరుబయట ఆడుకుంటుండగా అకస్మాత్తుగా వచ్చిన చిరుత అతన్ని నోట కరుచుకుని సమీపంలో ఉన్న చెరుకు తోటల్లోకి ఈడ్చుకు పోయింది.అనంతరం స్థానికులు బాలుడి కోసం వెతకగా చెరుకు తోటలో విగత జీవిగా కనిపించాడు.మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
No comments:
Post a Comment