రాజస్థాన్ రాష్ట్రంలోని శ్రీ గంగానగర్ జిల్లాలో భారత వైమానిక దళ (IAF) హెలికాప్టర్ కుప్పకూలింది.
రోజు వారీ కసరత్తులో భాగంగా శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో గగన తలంలో చక్కర్లు కొడుతున్న హెలికాప్టర్ సూరత్ గఢ్ నగర శివారులో కూలిపోయింది.
అందులో ముగ్గురు సిబ్బంది ఉండగా వారు సురక్షితంగానే బయట పడ్డారు అని రక్షణ శాఖ PRO తెలియజేశారు.
అయితే రక్షణశాఖ అందులో ఉన్న సిబ్బంది వివరాలు గానీ, ప్రమాద కారణాలుగానీ వెల్లడించలేదు.
కాగా దీనిపై IAF కోర్ట్ ఆఫ్ ఎంక్వయిరీ కి ఆదేశించింది.
No comments:
Post a Comment