భారీ భూకంపంతో అతలాకుతలమైన నేపాల్ వరుస భూకంపలతో భయాందోళనలను కల్పిస్తుంది.
భూకంపం దాటికి భారిగా నష్టపోయిన నేపాల్లో మృతుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది.
నేపాల్ ఉపప్రధాని బామ్ దేవ్ గౌతమ్ శిధిలాల కింది నుంచి 6 వేలకు పైగా మృతదేహాలను వెలికితీసినట్లు వెల్లడించారు.
7.9 తీవ్రతతో ప్రారంభమైన పెను భూకంపం దాటికి నేపాల్ లోని చాలా ప్రాంతాలు నెల మట్టమయ్యాయి.అంతే కాదు నేపాల్ కు కొండచరియల ముప్పు పొంచి ఉన్నదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
మరోసారి నేపాల్ లో బుధవారం మధ్యాహ్నం 3.9 గా భూకంప తీవ్రత నమోదైంది.
అనంతరం ఖాట్మండ్ లో సుమారు 10 కిలోమీటర్ల పరిధి వరకు మరోసారి భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 4.4 గా నమోదైందని భూగర్భ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
No comments:
Post a Comment