పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్న చిత్రం ‘ఆంధ్రా పోరి’.ఉల్కా గుప్తా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్ర ఆడియో విడుదల మే2 న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.డా.జోశ్య భట్ల ఈ చిత్రానికి సంగీతం అందించారు.
రమేష్ ప్రసాద్ నిర్మాణ సారథ్యంలో రాజ్ మాదిరాజు దర్శకతం వహిస్తున్నారు ఈ చిత్రానికి.షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఆంధ్రా పోరి’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.
60 ఏళ్ల చరిత్ర ఉన్న ‘ప్రసాద్ ప్రొడక్షన్’లో ఈ సినిమా వస్తుంది.35 రోజులపాటు సింగల్ షెడ్యూల్ లో సినిమా షూటింగ్ పూర్తి చేశాము.’అత్తారింటికి దారేది’ చిత్రంతో పాటు పలు చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన రిలయన్స్ ఎంటర్ టైనమెంట్స్ సంస్థ మా చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది, డా.జోశ్య భట్ల మంచి సంగీతాన్ని అందించారు,రమేష్‌ప్రసాద్‌గారు మరోసారి నాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చారు,మా కథపై నమ్మకంతో ఆకాష్ ను మాకు అప్పగించినందుకు పూరీజగన్నాథ్ కు కృతజ్ఞతలు అని దర్శకుడు రాజ్ మాది రాజు చెప్పారు.
No comments:
Post a Comment