ప్రధానమంత్రి నరేంద్రమోడీ కెనడా పర్యటన వల్ల 1.6 బిలియన్ కెనడా డాలర్ల విలువైన వ్యాపార రూపకల్పన జరిగిందని కెనడా ప్రభుత్వం ఒక ప్రకటనను విడుదల చేసింది.
ఈ వారంలో ప్రధాని కెనడా పర్యటనలో భారత్,కెనడా దేశాల కంపెనీలు,సంస్థలు మొత్తం 16 వాణిజ్య ఒప్పందాలు,ప్రకటనలు చేసుకున్నాయి.ఈ వాణిజ్య ఒప్పందాల,ప్రకటనల విలువ 1.6 బిలియన్ కెనడా డాలర్లు అని కెనడా ప్రధాని స్టీఫెన్ హార్పర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ వాణిజ్య ఒప్పందంలో అంతరిక్ష మరియు రక్షణ రంగం,విద్య, శక్తి, మైనింగ్, మౌలిక సదుపాయాలు, సుస్థిర సాంకేతికతలు, సమాచార మరియు ప్రసార సాంకేతికత రంగాలు ఉన్నాయి.ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధం గణనీయమైన అభివృద్ధికి దోహదపడనుంది అని ఆ ప్రకటనలో పేర్కొంది ప్రధాని కార్యాలయం.
ఇండియాలో పర్యటించే కెనడా దేశస్థులకు వీసాల జారీ సులభ తరం చేస్తామని ప్రధాని మోడీ చెప్పడాన్ని కెనడా ప్రధాని ఆహ్వానించారు,రెండు దేశాల ప్రధానుల చర్చల్లో ద్వైపాక్షిక విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మరియు సంక్షేమ ఒప్పందం మీద పురోగతి,అలానే అన్ని అపరిష్కృత సమస్యల పరిష్కారానికి చర్చలు తీవ్రతరం చేయాలని నిశ్చయించారు అని ప్రకటనలో పేర్కొంది.
No comments:
Post a Comment