తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ముఖ్యమంత్రి కెసిఆర్ తరపున ఆరు సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి.
పార్లమెంటరీపార్టీ తరపున పెద్దపల్లి ఎంపీ సుమన్,నరదాసు లక్ష్మణ్ రావు లు నామినేషన్లు దాఖలు చేయగా శాసనసభ పక్షం తరపున సోమారపు సత్యనారాయణ,మంత్రుల తరపున జగదీశ్ రెడ్డి,మహేందర్ రెడ్డి,ఉపముఖ్య మంత్రులు మహమూద్ ఆలి,కడియం శ్రీహరి కెసిఆర్ పేరును బలపరుస్తూ ఎన్నికల రిటర్న్ అధికారి నాయిని నరసింహ రెడ్డికి నామినేషన్లు సమర్పించారు.
నామినేషన్లు దాఖలు చేయడానికి సోమవారం మధ్యాహ్నం రెండు గంటల వరకు సమయం ఉంది.
ఐతే కెసిఆర్ ఎన్నిక ఏకాగ్రీవమే అయ్యే అవకాశం ఉంది.అధ్యక్ష పదవికి ఇంకెవరు నామినేషన్ వేసే అవకాశం కనిపించడం లేదు.
No comments:
Post a Comment