మొదటిసారి హెచ్ఐవీ పరీక్షను ఇంట్లోనే చేసుకునే సదుపాయం కల్పించింది యూకే ఫార్మా కంపెనీ బయో ష్యూర్.ఇంట్లోనే సొంతంగా 15 నిమిషాల్లో HIV పరీక్ష చేసుకోవాడానికి మొట్టమొదటగా చట్టబద్ధ ఆమోదం లభించడంతో ఆన్ లైన్ లో అమ్మకాలు జరుగుతున్నాయి.కాకుంటే ఇండియా కి రాలేదు ఈ కిట్.కేవలం యూకే,స్కాట్లాండ్ మరియు వేల్స్ లో మాత్రమే లభ్యమవుతాయి ఈ కిట్లు.
గర్భధారణ పరీక్ష ఇంట్లోనే చేసుకునే విధంగా ఇప్పుడు HIV పరీక్ష ఇంట్లోనే చేసుకునే అవకాశం రావడం వల్ల అక్కడి చారిటీలు హర్షాన్ని వ్యక్తం చేశాయి.ఎందుకంటే యూకే లో దాదాపు 26 వేల మందికి HIV ఉంది,కాని వారు పరీక్ష చేసుకోవడానికి విముఖత చూపుతున్నారు.ఇప్పుడు ఇక ఆ సమస్య ఉండదని భావిస్తున్నారట.
పరీక్ష చేసుకునే విధానం :
మొదట చేతి వ్రేలు నుండి ఒక చుక్క రక్తం తీసి పరికరంలో వేసినప్పుడు 15 నిమిషాల తరువాత అందులో రెండు ఊదా రంగు గీతలు కనిపిస్తే HIV ఉన్నట్టు నిర్ధారించుకోవచ్చు.
మనిషి రక్తంలో ఉండే ప్రతిరోధకాలు-ప్రోటీన్లు వైరస్ కు ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నాయో తెలుసుకొని ఫలితాన్ని అందిస్తుంది ఈ పరికరం.ఐతే రక్తంలో HIV వైరస్ మూడు నెలల ముందు నుండే ఉంటె ఈ పరీక్ష ద్వారా ఫలితం తెలుస్తుంది.లేదంటే ఫలితం నెగటివ్ రావొచ్చు.కాబట్టి ఫలితం నిర్దారణ కోసం క్లినిక్ కు వెళ్లి పరీక్ష చేయించుకుంటే మంచిదని కంపెనీ తెలిపింది.
త్వరలోనే భారత్ లో ఈ పరికరాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
No comments:
Post a Comment