Radio LIVE


Breaking News

Saturday, 25 April 2015

నేపాల్ ని అతలాకుతలం చేసిన భారీ భూకంపం

శనివారం ఉదయం నేపాల్ రాజధాని ఖాట్మండ్ ను భూకంపం అతలాకుతలం చేసింది. ఈ భూప్రలయానికి పురాతన కట్టడాలు, పాత భావనలు, ధరహరా టవర్ కుప్పకూలిపోయాయి. ఇప్పటివరకు 700 మంది మరణించినట్లు సమాచారం. భూకంపంపై నేపాల్ ప్రధాని సుశీల్ కోయిరాలాతో భారత ప్రధాని మాట్లాడారు. ఇప్పటికే నేపాల్ కు జాతీయ విపత్తు నిర్వహణ బృందాన్ని పంపించిన మోడీ నేపాల్ ను అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తామని చెప్పారు. భూకంపం ధాటికి భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. మృత దేహాల వెలికితీత చర్యలు కొనసాగుతున్నాయి.క్షతగాత్రులు ఆస్పత్రుల్లో నిండిపోయారు. దీంతో ఆస్పత్రుల్లో స్థలం సరిపోకపోవడంతో రోడ్లపైనే వైద్యం అందిస్తున్నారు. నేపాల్ తో పాటు ఉత్తర ,ఈశాన్య భారత్ ను కూడా ఈ భూకంపం గజగజ వణికిస్తుంది.

నేపాల్ ను వణికించిన భూకంపం…చిత్రాలు

దీంతో ఖాట్మండ్ లో ఎంబసీ అత్యవసర ఫోన్ నెంబర్లను ఏర్పాటు చేసింది. ఫోన్ నెంబర్లు : 00977-9851107021, 00977-9851135141.
 కేంద్ర హోం శాఖ కార్యాలయంలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు : +91 11 2301 2113, +91 11 2301 4104.

భూకంపం వచ్చిన సమయంలో సుమారు 25 మంది తెలుగు భక్తులు ఖాట్మండ్ లోని ఓ హోటల్ లో బస చేస్తున్నట్లు సమాచారం. భూకంప తీవ్రతను చూసి భక్తులు బయటికి పరుగులు తీసి సురక్షితంగా బయటపడ్డారు.
ఈ భక్తులు హైదరాబాద్ కు చెందిన వారుగా సమాచారం.

నేపాల్ లో వెటకారం సినిమా షూటింగ్ కోసం వెళ్లిన సినిమా యూనిట్ సభ్యుల ఆచూకి తెలియడం లేదు. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates