ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం భారతదేశంలో ప్రతి సంవత్సరం 2.1 మిలియన్ల క్షయ కేసులు నమోదవుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా లోక్ సభలో వెల్లడించారు.
దేశవ్యాప్తంగా 13 వేల వ్యాధి నిర్ధారణ కేంద్రలతో పాటు, రోగులకు 6 లక్షలకు పైగా చికిత్స కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు.
వ్యాధి నివారణకు, నియంత్రణకు తీసుకుంటున్న పలు చర్యల గురించి వివరణ ఇస్తూ వ్యాధిగ్రస్తులకు జాతీయ క్షయ వ్యాధి నియంత్రణ కార్యక్రమం ద్వారా ఉచితంగా వైద్యం, మందులు అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
No comments:
Post a Comment