విశాఖపట్నంలో ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్ లలో రెండు ఓటమిపాలైంది.శనివారం ఢిల్లీ తో జరిగిన ఉత్కంట పోరులో 4 పరుగుల తేడాతో పరాజయం పొందింది.
168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైసర్స్ కు మంచి ఆరంభమే లభించింది.మొదటి వికెట్ కు ధావన్,వార్నర్ కలిసి 6 ఓవర్లలో 50 పరుగులు జోడించారు.డుమినీ వేసిన తరువాతి ఓవర్ మొదటి బంతికే 18 పరుగులు చేసిన ధావన్ ఔటయ్యాడు.ఆ వెంటనే మూడో బంతికి ఊపు మీద ఉన్న వార్నర్ కూడా 28 పరుగులు చేసి వెనుదిరిగాడు.
ఇక్కడ జత కూడిన రాహుల్,బొపారా లు ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును నెమ్మదిగా కదిలించారు.మధ్యమధ్యలో వీలు చిక్కినప్పుడు ఇద్దరూ సిక్సులు కొడుతూ జట్టు స్కోరును 89 పరుగులకు చేర్చాక రాహుల్ 24 పరుగులు చేసి మాథ్యుస్ బౌలింగ్ లో బౌల్డై పెవీలియన్ చేరాడు.బొపారా కు నమన్ ఓజా జత కావడంతో స్కోరు వేగం పెరిగింది.
సాధించాల్సిన లక్ష్యం పెరగడంతో వేగంగా ఆడే క్రమంలో ఓజా(12),బొపారా(41),మోర్గాన్(1) వెంటవెంటనే ఔటయ్యారు.మూడు ఓవర్లలో 39 పరుగులు చేయాల్సిన సమయంలో క్రీజ్ లోకి వచ్చిన కరణ్ శర్మ 17వ ఓవర్లో 17 పరుగులు చేసి విజయంపై ఆశలు పెంచాడు.తరువాతి ఓవర్లో 12 పరుగులు చేసి చివరి ఓవర్లో 10 పరుగులు చేస్తే విజయం సాధిస్తుంది అనే వరకు వచ్చింది.చివరి ఓవర్లో 6 పరుగులు మాత్రమే ఇచ్చిన కోల్టర్ నైల్ ఢిల్లీని గెలిపించాడు.
ఢిల్లీ కెప్టెన్ డుమినీ 54 పరుగులతో పాటు 4 వికెట్లు తీసుకొని ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు.డుమినీ మ్యాన్ అఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.
ఢిల్లీ కి ఇది రెండో విజయం ఇప్పటి వరకు ఈ సీజన్లో.
No comments:
Post a Comment