కరీంనగర్ జిల్లాలోని భగత్ నగర్ కి చెందిన కామారావు లక్ష్మి అనే 9నెలల గర్భిని 30నిముషాల 20 సెకన్లలో 5 కి.మీ. పరుగు పూర్తి చేసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది.
తన మొదటిసారి గర్భినిగా ఉన్నప్పుడు 5 కిలోమీటర్ల పరుగు చేయడం వల్లనే సుఖ ప్రసవం జరిగిందని, అందుకే రెండో కాన్పు కూడా సుఖ ప్రసవం కోసం 5కి.మీ పరుగు చేపట్టి గిన్నిస్ బుక్ లో తన పేరు నమోదు కోసం ప్రయత్నించినట్లు ఆమె అన్నారు.
లక్ష్మీ కరీంనగర్ లోని అంబేడ్కర్ స్టేడియంలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ బృందం, వైద్యులు, క్రీడా సంఘాల సమక్షంలో 5 కి.మీ పరుగు పూర్తి చేసిన అనంతరం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు లక్ష్మీని సత్కరించి ధృవీకరణ పత్రం అందజేశారు.
ఆమె వివరాలు గిన్నిస్ బుక్ ప్రతినిధులకు అందజేయనున్నట్లు వారు వెల్లడించారు.
No comments:
Post a Comment