తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమల్లో భాగంగా వరంగల్ జిల్లా లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో వాకింగ్ ట్రాక్ ను ప్రారంభించారు.
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తో కలిసి కడియం శ్రీహరి గురువారం ఉదయం ఎంపీ ల్యాడ్స్ రూ.10 లక్షలతో వాకింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేశారు.
ఈ ట్రాక్ ను ప్రజలకు మరింత ఉపయోగకరంగా మార్చేందుకు మరిన్ని నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.హైదరాబాద్ లోని KBR పార్కులా గ్రీనరి, లైటింగ్ ఏర్పాటు చేసి దీన్ని అభివృద్ధి చేస్తామని కడియం తెలిపారు.
No comments:
Post a Comment