Radio LIVE


Breaking News

Thursday, 30 April 2015

19 రోజుల్లో 57 అంతస్తుల ఆకాశ హర్మ్యాన్ని నిర్మించిన చైనీయులు

సాధారణంగా ఎవరైనా చిన్న ఇల్లు కట్టుకోవాలంటే దాదాపు సంవత్సరం కాలం పడుతుంది. అలాంటిది 19 రోజుల్లో 57 అంతస్తుల ఆకాశ హరమ్యాన్ని నిర్మించి చూపించింది చైనాకు చెందిన ఓ భవన నిర్మాణ సంస్థ.
“మినీ స్కై సిటీ పేరుతో సెంట్రల్ చైనాలోని ఛాంగుషా సమీపంలో దీన్ని నిర్మించారు.

భవనాన్ని దీర్ఘచతురస్రాకారంలో నిర్మించడానికి ఉక్కు, గాజును ఉపయోగించినట్లు భావన నిర్మాణ యజమాని అన్నారు.
అయితే 57 అంతస్తుల భవనం నిర్మించడానికి గాను రోజుకు 3 అంతస్తుల చొప్పున కట్టేసి 19 రోజుల్లో భవన నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు ఆయన వివరించారు.
Read more ...

రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చిన “ఐకియా ఇండియా”

ఐకియా ఇండియా సంస్థ తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించడానికి ముందుకొచ్చింది. ఈ సంస్థ తమ వ్యాపార నిర్వహణ కోసం 50 వేల చదరపు మీటర్ల స్థలం కావాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. టీస్ఐఐసీ కి చెందిన భూమిని ఎకరం రూ.19.21 కోట్లతో కొనడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది.
Read more ...

భారీగా తగ్గించిన వోడాఫోన్ రోమింగ్ రేట్లు

వోడాఫోన్ రోమీంగ్ రేట్లను భారీగా తగ్గించింది. ట్రాయ్ సీలింగ్ టారిఫ్ లను తగ్గించిన నేపధ్యంలో వోడాఫోన్ ఈ మేరకు జాతీయ రోమింగ్ ఛార్జీలను తగ్గిస్తూ ఓ ప్రకటనను విడుదల చేసింది.


వోడాఫోన్ తన రోమింగ్ రేట్లను 75% వరకు తగ్గించింది. మే 1 నుంచి ఈ సవరించిన రేట్లు వినియోగదారులకు అమలులోకి వస్తాయని వెల్లడించింది.
Read more ...

అణు విద్యుదుత్పాదక దేశాల్లో 13వ స్థానంలో ఉన్న భారత్

భారతదేశం అణు విద్యుదుత్పాదక దేశాల్లో 13వ స్థానం దక్కించుకుందని గురువారం ప్రభుత్వం వెల్లడించింది. పవర్ రియాక్టర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజన్సీ విడుదల చేసిన నివేదికలో భారత్ 13వ స్థానాన్ని కైవశం చేసుకున్న విషయాన్ని తెలిపింది. ఈ మేరకు మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. అణు విద్యుదుత్పత్తి కోసం అత్యధిక రియాక్టరు ఉన్న దేశాల్లో ఇండియా 7వ స్థానంలో ఉందని, ప్రస్తుతం రియాక్టర్ల సామర్ధ్యం 5,780మెగావాట్లు ఉండగా ఇది 2019 కల్లా 10,080 మెగావాట్లకు చేరుతుందని ఆయన అన్నారు.
Read more ...

మలాలాపై దాడిచేసిన నిందితులకు 25 ఏళ్ల జైలు శిక్ష

పాకిస్థాన్ బాలికల విద్యకోసం పోరాడిన నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మాలాలా యూసఫ్ జాయ్ పై తాలిబన్లు చేసిన దాడి కేసులో పాకిస్థాన్ కోర్టు తీర్పును ఇచ్చింది.
మలాలాపై దాడి ఘటనలో 10 మంది నిందితులకు 25 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేస్తూ గురువారం పాక్ ఉగ్రవాద నిరోధక కోర్టు తీర్పును ఇచ్చింది. తాలిబన్ ఉగ్రవాదులు 2012 అక్టోబర్ లో మలాలా పై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.
Read more ...

మా నాన్నగారి కోసం ఓ వెబ్ సైట్ : అమితాబ్ బచ్చన్

ప్రముఖ బాలీవుడ్ దిగ్గజం ఓ వెబ్ సైట్ ను ప్రారంభించే పనిలో ఉన్నారు.ఈ వెబ్ సైట్ ను తన తండ్రి , ప్రముఖ రచయిత “హరివంశ్ రాయ్ బచ్చన్” కు అంకితం చేయనున్నట్లు బిగ్ బీ తెలిపారు.
ఈ వెబ్ సైట్ లో తన తండ్రి గురించి సమగ్రమైన సమాచారం ఉంటుందని ఆయన వెల్లడించారు.అంతేకాదు తన తండ్రి హరివంశ్ రాయబచ్చన్ గురించి అభిమానులకు తమకు తెలిసిన అంశాలను తనతో పంచుకోవాలని, తమ వద్ద ఇందుకు సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా, ఫోటోలు ఉన్నా పంపండంటూ ట్విట్టర్లో మెయిల్ అడ్రస్ కూడా పెట్టారు.
హరివంశ్ రాయబచ్చన్
హరివంశ్ రాయ్ గురించి ఎలాంటి విషయాన్నైనా షేర్ చేసుకోవాలంటే thebachchanfamily@gmail.com కు మెయిల్ చేయాలని బిగ్ బీ అభిమానులను ట్విట్టర్ ద్వారా కోరారు.
Read more ...

ప్రఖ్యాత కార్టూనిస్ట్ గోపులు మృతి

ప్రముఖ చిత్రకారుడు, కార్టూనిస్ట్ S.గోపాలన్ (91) మరణించారు. S.గోపాలన్ పత్రికారంగంలో గోపులుగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. తమిళ హాస్య పత్రిక ఆనంద్ వికటన్ లో ఆయన భిన్నమైన శైలిలో వేసిన చిత్రాలు, కార్టూన్లు ఎన్నోఏండ్లు పాఠకులనుఅలరించాయి.
అయితే గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న గోపులు బుధవారం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.
గోపాలన్ 1924 లో తంజావూరులో జన్మించారు. కుంభకోణం స్కూల్ లో చిత్రకళ విద్యను పూర్తి చేసిన గోపాలన్ ఆనంద వికటన్ అనే పత్రికలో చేరారు.
1986 వరకు కూడా కవర్ పేజ్ డిజైన్లు, రాజకీయ వ్యంగ్య కార్టూన్లు, మ్యాగజైన్ కాలాలకు చిత్రాలను గీశారు. ఇక్కడే ప్రఖ్యాత కార్టూనిస్ట్ మాలి తో గోపాలన్ కు పరిచయం ఏర్పడింది.
అయితే గోపాలన్ యొక్క కలం పేరును గోపులుగా మార్చినది మాలినే. బాపు తన గురువుగా గోపులును చెప్పుకునేవారు.
గోపులు అందుకున్న అవార్డులు :
ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్ట్స్(బెంగళూర్) గోపులుకు లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డుతో సత్కరించింది.
తమిళనాడు ప్రభుత్వం కళైమామణి అవార్డుతో సత్కరించింది.
మురుసోళి, ఎంఏ చిదంబరం చెట్టియార్ అవార్డులను అందుకున్నారు.
Read more ...

తండ్రి కలను నేరవేర్చినందుకు సంతోషంగా ఉంది : నటి సుస్మితా సెన్

బెంగాలీ చిత్రసీమలో నటించాలనే తన తండ్రి కలను నేరవేర్చానని మాజీ విశ్వసుందరి, బాలివుడ్ నటి సుస్మితా సేన్ అన్నారు.తాను నటించిన బెంగాలీ చిత్రం నిర్బాక్ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా సుస్మిత మాట్లాడుతూ.. బెంగాలీ చిత్రంలో నటించి నాన్న కల నేరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉందని, ఈ చిత్రం ప్రారంభం నుంచి చిత్ర దర్శకుడు శ్రీజిత్ ముఖర్జీ ప్రతి విషయంలో తనకు సహకరించి ప్రోత్సహించారని ఆమె వెల్లడించారు. దర్శకుడు శ్రీజిత్ మాట్లాడుతూ బెంగాలి శైలికి తగినట్లు సుస్మిత చక్కగా నటించారని కొనియాడారు.
Read more ...

Wednesday, 29 April 2015

తెలంగాణలో అమలుచేయనున్న ఇజ్రాయెల్ సాగు పద్ధతులు

ఇజ్రాయెల్ తమ పంటల సాగుకు అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులు, విధానాలను తెలంగాణ రాష్ట్రంలోను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పొచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇజ్రాయల్ లోని టెల్ అవీవ్ లో అంతర్జాతీయ వ్యవసాయ సదస్సు (అగ్రి టెక్ -2015) జరుగుతుంది.
ఈ సదస్సులో పాల్గొనడానికి వెళ్లిన పొచారం బృందం వెళ్లింది. దీనిలో భాగంగానే బుధవారం వారు పలు వ్యవసాయ క్షేత్రాల్లో పర్యటించి వివిధ పంటల సాగు విధానాన్ని పరిశీలించారు. అనంతరం టెల్ అవీవ్ పట్టణానికి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొఘల్ అనే గ్రామంలో పంటల సాగును అధ్యయనం చేశారు.
Read more ...

నేను హిందూముస్లింను : బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్

బుధవారం బాలీవుడు నటుడు సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను వేటాడిన కేసులో రాజస్థాన్ లోని జోధ్ పూర్ కోర్టు కు హాజరయ్యారు. ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ ను మేజిస్ట్రేట్ పలు ప్రశ్నలు అడిగారు. నీది ఏ మతం అని మేజిస్ట్రేట్ ప్రశ్నించగా .. తాను ఏ మతానికి సంబంధించినవాడిని కాదని, భారతీయుడనని మొదట సల్మాన్ బదులిచ్చారు. అయితే సూటిగా సమాధానం చెప్పాలని మేజిస్ట్రేట్ ఆయనను ఆదేశించగా నా తండ్రి ముస్లిం, నా తల్లి హిందువు. అందుకే నేను హిందూముస్లింను అని సల్మాన్ వాంగ్మూలం ఇచ్చారు.
Read more ...

KTR అమెరికా పర్యటన

మే 2వ వారంలోతెలంగాణ పంచాయతీ రాజ్ , ఇతీశాఖ మంత్రి కే.తారక రామారావు అమెరికా పర్యటించనున్నారు. ఈ పర్యటన 15 రోజులపాటు జరగనుంది. ఈ పర్యటనలో KTR అమెరికాలోని వివిధ ప్రాంతాలలో పర్యటించి,తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించడానికి అమెరికాలోని పలు కంపెనీలు,పలువురు పారిశ్రామికవేత్తలతో, మరియు సంస్థలు సమావేశం అవుతారు. తన అమెరికా పర్యటనకు సంబంధించి బుధవారం KTR ట్విట్టర్ లో పేర్కొన్నారు. అమెరికా కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఐటీ, పారిశ్రామిక పాలసీలను వివరించునున్నట్లు తెలిపారు. అంతేకాదు అమెరికా లో ఉన్న ప్రవాస తెలంగాణ ప్రజలను కూడా భారీగా పెట్టుబడులు పెట్టాలని కోరనున్నారని సమాచారం.
Read more ...

నేపాల్ భూకంపాన్ని అధ్యయనం చేయనున్న NGRI

జాతీయ భూ భౌగోలిక పరిశోధన సంస్థ (NGRI) శాస్త్రవేత్తలు నేపాల్ లో వచ్చిన భూకంపాన్ని అధ్యయనం చేయనున్నారు.
ఈమేరకు త్వరలోనే నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో వారు పరిశోధనలు చేపట్టనున్నారు.
భూకంపం వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాలని ఆ నివేధికల ఆధారంగానే గుర్తిస్తామని దీనివల్ల భూకంపం సంభవించే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుందని NGRI అదనపు ఇంఛార్జి C.H. మోహన్ రావు వెల్లడించారు.
Read more ...

గ్రామ పంచాయతీల్లో నీరు-చెట్టు అవగాహన సదస్సులు : ఏపీ

మే 2 నుంచి మే 11 వరకు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని గ్రామ పంచాయతీల్లో నీరు-చెట్టు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయనున్నారు.
ఈ సదస్సులో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీని మండల స్థాయి కమిటీ సందర్శిస్తుంది.
నీటిపారుదల శాఖలోని ఒక ఇంజనీరింగ్ అధికారి, రెవెన్యూ, మండల అభివృద్ధి అధికారి, మండల వ్యవసాయధికారి, ఉపాధి హామీ ఏపీవో, అటవీ సంరక్షణ అధికారి తో పాటు నీరు చెట్టుతో సంబంధం ఉన్న ఇతర మండలస్థాయి అధికారులు ఈ బృందంలో ఉంటారు.
వీరు రోజు రెండు సార్లు పంచాయతీలను సందర్శించాల్సి ఉంటుంది.
Read more ...

ఖాట్మండ్ లో మరోసారి కంపించిన భూమి..6 వేలకు చేరిన మృతుల సంఖ్య

భారీ భూకంపంతో అతలాకుతలమైన నేపాల్ వరుస భూకంపలతో భయాందోళనలను కల్పిస్తుంది. భూకంపం దాటికి భారిగా నష్టపోయిన నేపాల్లో మృతుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. నేపాల్ ఉపప్రధాని బామ్ దేవ్ గౌతమ్ శిధిలాల కింది నుంచి 6 వేలకు పైగా మృతదేహాలను వెలికితీసినట్లు వెల్లడించారు.
7.9 తీవ్రతతో ప్రారంభమైన పెను భూకంపం దాటికి నేపాల్ లోని చాలా ప్రాంతాలు నెల మట్టమయ్యాయి.అంతే కాదు నేపాల్ కు కొండచరియల ముప్పు పొంచి ఉన్నదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మరోసారి నేపాల్ లో బుధవారం మధ్యాహ్నం 3.9 గా భూకంప తీవ్రత నమోదైంది. అనంతరం ఖాట్మండ్ లో సుమారు 10 కిలోమీటర్ల పరిధి వరకు మరోసారి భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 4.4 గా నమోదైందని భూగర్భ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
Read more ...

మిషన్ కాకతీయకు రూ. 25 లక్షల విరాళం : క్రెడాయ్

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకం కోసం క్రెడాయ్ గతంలో ముఖ్యమంత్రికి రూ.50 లక్షలు విరాళాన్ని అందించింది. కాగా బుధవారం నాడు మంత్రి హరీష్ రావుకు మరో రూ.25 లక్షల చెక్కును క్రెడాయ్ ప్రతినిధులు విరాళంగా అందజేసింది. త్వరలోనే మరో రూ.25 లక్షలను ప్రభుత్వానికి అందజేయనున్నట్లు వారు వెల్లడించారు.
Read more ...

ఈతకు వెళ్లి మృతి చెందిన ఏడుగురు

మహబూబ్ నగర్ జిల్లాలోని ఆమనగల్లు మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఆమనగల్లు మండలంలోని సిరికొండ గౌరమ్మ చెరువులో ఈతకు వెళ్లిన ఏడుగురు మృతిచెందారు.వీరు విహారయాత్ర కోసం వెళ్లినట్లు తెలుస్తోంది. వీరంతా హైదరాబాద్ లోని చాంద్రయణగుట్ట వాసులుగా గుర్తించారు. మృతుల్లో 3 మహిళలు, 4 పురుషులు ఉన్నట్లు సమాచారం.
Read more ...

వెబ్ ఛానెల్ లో ఉద్యోగమంటూ మోసం చేసిన కేడి

శ్రీనివాస్ అనే వ్యక్తి వెబ్ ఛానెల్లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేశాడు. 70 మంది నిరుద్యోగుల నుంచి రేనా బ్రాడ్ కాస్టింగ్ గ్రూప్ ఆఫ్ నెట్ వర్క్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ వారి నుంచి రూ.3 లక్షలు వసూలు చేసి పత్తా లేకుండా ఉడాయించాడు. దీంతో బాధితుల ఎల్బీనగర్ పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read more ...

కత్తితో భార్యనే పొడిచి చంపిన భర్త

కరీంనగర్ జిల్లాలో దారుణం ఓ చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో ఓ సాడిస్ట్ భర్త కట్టుకున్న భార్యనేచంపాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలోని గొల్లపల్లి మండలం గోవింద పల్లిలో జరిగిది. భార్యాభర్తల మధ్య స్పర్ధలు రావడంతో గత కొంతకాలంగా భార్య మమత తన తల్లి వద్ద ఉంటుంది. భర్త మల్లేష్ ఈ క్రమంలో భార్యపై అనుమానం పెంచుకున్నాడు.బుధవారం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న భార్యపై అనుమానంతో ఉన్న మూర్ఖపు భర్త ఆమెను కత్తితో పొడిచి హతమార్చాడు.
Read more ...

Tuesday, 28 April 2015

2026 నాటికి 17 కోట్లకు చేరనున్న వృద్దుల సంఖ్య

భారతదేశంలో వృద్దుల సంఖ్య 2026 నాటికి 17 కోట్లకు చేరనుంది. ఇది దేశం మొత్తం జనాభాలో 12%. ఈ మేరకు లోక్ సభలో కేంద్ర సహాయకమంత్రి విజయ్ సాంప్లా తెలిపారు. 2006లో అధికారుల అంచనాల ప్రకారం భారత్ లో వృద్ధుల సంఖ్య 2016లో మొత్తం దేశ జనాభాలో 11.81% ఉంటుందని, ఇది 2021 నాటికి 14.31% నికి చేరుతుందని ఆయన అన్నారు. 2001-2011 మధ్య కాలంలో వృద్దుల సంఖ్య 7.7 కోట్ల నుంచి 10.38 కోట్లకు పెరిగిందని ఆయన వెల్లడించారు.
Read more ...

నేడు వరంగల్ జిల్లా లో పర్యటించనున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం

బుధవారం వరంగల్ జిల్లాలోని గూడూరు మండలంలో తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి పర్యటించనున్నారు. మిషన్ కాకతీయలో భాగంగా చేపట్టనున్న బొడ్డుగొండలోని పెద్ద చెరువు పనులను ఈ సందర్భంగా కడియం ప్రారంభించనున్నారు.
Read more ...

సౌదీలో కుప్పకూలిన భవనం..మృతి చెందిన 10మంది కూలీలు

సౌదీ అరేబియాలో నిర్మాణంలో ఉన్న భవనం కూలి 10మంది కూలీలు మరణించారు. ఈ భవన నిర్మాణం రియాద్ లోని అల్ ఖాసిమ్ విశ్వవిద్యాలయం సమీపంలో జరుగుతుంది. ఈ ఘటనలో మృతి చెందిన వారు 9 మంది పాకిస్తాన్ కు చెందిన కూలీలు కాగా ఒకరు భారత్ కు చెందిన వారు ఉన్నారు. భవనంపై కాంక్రీట్ ను తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు.అయితే ఇప్పటి వరకు 6 మృతదేహాలను వెలికితీయగా మిగిలిన వరీకోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మరో 10 మంది కూలీలు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.
Read more ...

ఢిల్లీ కి చేరిన ‘ఎటకారం’ చిత్ర నటుడు విజయ్ మృతదేహం

నేపాల్ భూకంపంలో నేపధ్యంలో షూటింగ్ విరమించుకుని ‘ఎటకారం’ సినిమా యూనిట్ సభ్యులు తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ సందర్భంలోనే మరోసారి భూకంపం సంభవించడంతో ఎటకారం సినిమా నటుడు, నృత్య దర్శకుడు అయిన విజయ్(25) ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి గురైన 10 నిముషాలకే విజయ్ మృతి చెందారు. ప్రస్తుతం విజయ్ మృతదేహం ఢిల్లీ కి చేరుకుంది.
బుధవారం మద్యాహ్నానికి విజయ్ మృతదేహం హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతరం మృతదేహాన్ని అక్కడి నుంచి విజయ్ స్వస్థలమైన గుంటూరు జిల్లా బాపట్లకు తరలించనున్నారు.
Read more ...

రాష్ట్ర పోలీసులను సిమి ఉగ్రవాదులపై రివార్డును స్వీకరించాలని కోరిన మధ్యప్రదేశ్

మధ్యప్రదేశ్ ప్రభుత్వం పోలీసు ఎదురుకాల్పుల్లో హతమైన సిమి ఉగ్రవాదులపై ఉన్న రివార్డును స్వీకరించాలని తెలంగాణ పోలీసులను కోరింది. గతంలో మధ్యప్రదేశ్ ఖండ్వా జైలు నుంచి అస్లాం, జాకీర్ హుస్సేన్, ఎజూజుద్దీన్, హమబూబ్, అంజద్ లు పరారయ్యారు. వీరిపై అక్కడి పోలీసులు ఒక్కొక్కరిపై రూ.1 లక్ష చొప్పున రివార్డు ప్రకటించింది. అయితే వీరిలో ఇద్దరు ఉగ్రవాదులు అస్లాం, ఎజాజు లు ఇటివలే నల్గొండ జిల్లా జానకీపురం ఎదురుకాల్పుల్లో మృతి చెందారు. దీంతో వీరి పేరున ఉన్న రివార్డును స్వీకరించాల్సిందిగా తెలంగాణ పోలీసు శాఖకు మధ్యప్రదేశ్ పోలీసుశాఖ ఓ లేఖ రాసింది.
Read more ...

5,057 కి చేరిన నేపాల్ మృతుల సంఖ్య.. చిత్రాలు

భూకంపం సృష్టించిన భూప్రళయానికి నేపాల్ అతలాకుతలమైంది.మృతుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. మంగళవారం సాయంత్రానికి నాటికి నేపాల్ లో మృతుల సంఖ్య 5,057 కి చేరింది. అయితే ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది. మంగళవారం ఉదయమే నేపాల్ ప్రధాని సుశీల్ కొయిరాల మృతుల సంఖ్య 10,000 కు చేరవచ్చునని వెల్లడించారు.
భూ కేంద్రానికి సమీపంలోనే ఉన్న ఒక గ్రామంలో కొండచరియలు విరిగిపడ్డాయి. అధికారులు ఈ ఘటనలో 250 మంది గల్లంతైనట్లు తెలిపారు. అయితే సహాయక చర్యలు ఆశించిన మేరకు సాగడం లేదని నేపాల్ ప్రధాని అంగీకరించారు.
సహాయక సిబ్బంది ఇంకా మారుమూల ప్రాంతాలకు చేరలేకపోతున్న నేపధ్యంలో బాధితులే పలు చోట్ల తమ ఆత్మీయుల కోసం శిధిలాలలో అన్వేషిస్తున్నారు. 15 దేశాలకు చెందిన 170 మంది విదేశియూల్ని భారత్ మంగళవారం సురక్షితంగా తరలించింది. నేపాల్ భూకంపం భాధితుల కోసం భారత్ తన సహాయక చర్యలను కొనసాగిస్తూనే ఉంది.
Read more ...
Designed By Published.. Blogger Templates