మంగళవారం బెర్లిన్ లో నరేంద్రమోడి, జర్మనీ ఛాన్సలర్ ఎంజలా మెర్కెల్ సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. భారత్ ఆర్ధికంగా ఎంతో బలపడుతోందని, ఇండియా తయారీ రంగంలో జర్మనీ పెట్టుబడులకు అంగీకరించడం సంతోషంగా ఉందని, మేక్ ఇన్ ఇండియాలో పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతున్నామని ఆయన అన్నారు.
అభివృద్ధిలో పెట్టుబడులే కీలకమని, భారత్-జర్మనీ సంబంధాలు మున్ముందు మరింత బలోపేతం కావాలన్నారు.
ఇండియా తయారి రంగంలో అభివృద్ధి బాటలో పయనిస్తోందని మోడీ తెలిపారు.
ఏంజెలా మెర్కెల్ భారత్ పర్యటించాలని కోరుతున్నానని అన్నారు.
జర్మనీ-భారత్ కలిసి పని చేస్తే ఇంకా మంచి ఫలితాలు సాధించగలమని మేడి ఆకాంక్షించారు.
No comments:
Post a Comment